Muralidhar Rao: కత్తులతో దాడికి దిగారు.. గోరక్షకులు దేవాలయంలోకి పరుగులు తీశారు
హైదరాబాద్ కర్మన్ ఘాట్‌లో ఉద్రిక్త పరిస్థితులు దురదృష్టకరం అని అన్నారు బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు.

Muralidhar
Muralidhar Rao: హైదరాబాద్ కర్మన్ ఘాట్‌లో ఉద్రిక్త పరిస్థితులు దురదృష్టకరం అని అన్నారు బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు. దుండగులు గోవులను అక్రమంగా వాహనంలో తరలిస్తున్నారని తెలుసుకున్న గోరక్షక్ సభ్యులు ఆ వాహనాన్ని కర్మన్ ఘాట్ వద్ద అడ్డుకోగా.. ఆగ్రహించిన దుండగులు ఇన్నోవో వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టారు. కత్తులతో దాడికి దిగారు. దీంతో గోరక్షక్ సభ్యులు దగ్గరలో ఉన్న ఆంజనేయ దేవాలయంలోకి పరుగులు తీశారు.
అయితే, ఆలయంలోకి కూడా ప్రవేశించి కత్తులతో దాడి చేసినట్లుగా ఆరోపిస్తున్నారు మురళీధర్ రావు. గోవులను రక్షించిన గో రక్ష దళ్ సభ్యులపై దాడులు చేశారని, హైదరాబాద్‌లో గోవులకు రక్షణ లేదన్నారాయన. తెలంగాణ ప్రభుత్వం ఆవులను రక్షించడంలో విఫలమైందని అన్నారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వలనే గోవద ఎక్కువతుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సంఘటనపై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు అని నిలదీశారు మురళీధర్ రావు.
కత్తులతో దేవాలయంలోకి వెళ్లినవారిపై కొంతమంది దాడి చేసే ప్రయత్నం చేశారని, దేవాలయాన్ని పూర్తిగా సంప్రోక్షణ చేశామని చెప్పారు. ముంబై వెళ్లి కేసీఆర్ శివాజీని మెచ్చుకోవడం కాదు.. హైదరాబాద్‌లో దేవాలయం మీద జరుగుతున్న దాడులపై స్పందించాలని అన్నారు. దేశ విచ్ఛినకర శక్తులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణం చేస్తున్నారని అన్నారు.