గ్రేటర్‌లో ఐదురోజులు బీజేపీ అగ్రనేతల ప్రచారం

  • Publish Date - November 24, 2020 / 09:36 PM IST

BJP top leaders campaign : గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంపై బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టిపెట్టింది. ఐదురోజుల్లో గ్రేటర్‌లో అగ్రనేతలు ప్రచారం చేయనున్నారు. రేపు హైదరాబాద్‌లో స్మృతి ఇరానీ ప్రచారం చేయనున్నారు.



ఈ నెల 27న యోగి ఆదిత్యనాథ్‌ గ్రేటర్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 28న జేపీ నడ్డా గ్రేటర్‌లో ప్రచారంలో పాల్గోనున్నారు. 29న గ్రేటర్‌లో అమిత్‌షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.



గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర నేతలు దూసుకుపోతున్నారు. నగరంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దుబ్బాక గెలుపుతో రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లురూతున్నారు.



కాగా పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బండి వ్యాఖ్యలు నగరంలో హీట్ పుట్టించాయి. బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్, ఎంఐంఎం మండిపడుతున్నాయి.