×
Ad

Huzurabad Bypoll : బీజేపీదే విజయం – బండి సంజయ్

హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతోందని జోస్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.

  • Published On : October 30, 2021 / 07:32 PM IST

Hzb BJP

Huzurabad Bypoll Bandi Sanjay : హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతోందని జోస్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలియచేశారు. పార్టీ గెలుపు కోసం నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, వారికి.. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. 2021, అక్టోబర్ 30వ తేదీ శనివారం హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

Read More : Telugu States Bypoll : హుజూరాబాద్, బద్వేల్‌‌లో పోలింగ్ సమాప్తం

భారీగా ఓటర్లు పోటెత్తడంతో ఓటింగ్ శాతం పెరుగనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరించి, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిందని, ఓట్లను అడ్డగోలుగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా అసత్యపు ప్రచారాలు చేసిందని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికలో కేసీఆర్ అహంకారానికి, ఆత్మగౌరవానికి జరిగిన పోటీలో ప్రజలు ఒక మంచి ఆలోచనతో బీజేపీ పార్టీని ఆదరించారని చెప్పుకొచ్చారు.

Read More : Jagga Reddy : ఏపీ, తెలంగాణను కలుపుతా అంటే కేసీఆర్‌కు మద్దతిస్తా

పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి..టీఆర్ఎస్ అక్రమాలను అడ్డుకున్నారని, రాత్రి పగలు విజయం కోసం కష్టపడ్డారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో బీజేపీ శ్రేణులు మరింత కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడాలని కోరుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు.