Jagga Reddy : ఏపీ, తెలంగాణను కలుపుతా అంటే కేసీఆర్‌కు మద్దతిస్తా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్యవాదం వినిపించారు. సీఎం కేసీఆర్ సమైక్యవాదంతో ముందుకొస్తే.. తాను మద్దతిస్తానని చెప్పారు. ఉద్యమం సమయంలోనూ తాను సమైక్యవాదాన్నే వినిపించా

Jagga Reddy : ఏపీ, తెలంగాణను కలుపుతా అంటే కేసీఆర్‌కు మద్దతిస్తా

Jagga Reddy

Jagga Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్యవాదం వినిపించారు. సీఎం కేసీఆర్ సమైక్యవాదంతో ముందుకొస్తే.. తాను మద్దతిస్తానని చెప్పారు. ఉద్యమం సమయంలోనూ తాను సమైక్యవాదాన్నే వినిపించానని, తాను మొదట్నుంచి సమైక్యవాదినే అని తెలిపారు. తనను తెలంగాణ ద్రోహి అన్నా ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని, పార్టీతో దీనికి సంబంధం లేదని జగ్గారెడ్డి అన్నారు. తనకు ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలు ఒక్కటే అన్నారు.

Disease Attack : యువతపై జబ్బుల దాడి… చిన్న వయస్సులోనే మరణం అంచులకు..

‘ఉద్యమంలో నేను సమైక్యరాష్ట్రం ఉండని అంటే తెలంగాణ ద్రోహి అన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ మాటలు ఎలా అర్థం చేసుకోవాలి. కేసీఆర్ రెండు రాష్ట్రాలను కలుపుతా అంటే నేను మద్దతిస్తా. నా స్టాండ్ మొదటి నుంచి సమైక్య రాష్ట్రమే. నా వ్యక్తిగత అభిప్రాయాన్ని అడ్డుకునే అర్హత రేవంత్ కు లేదు. తెలంగాణ కోసం కొట్లాడిన కోదండరాం ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలీదు. సమైక్య రాష్ట్రం పేరు మీద ఏపీ, తెలంగాణ అధికార పార్టీలు కొత్త డ్రామా స్టార్ట్ చేశాయి. నేను రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పను, చెప్పే పరిస్థితి రాదు. నేను ఠాకూర్ కు మాత్రమే క్షమాపణ చెప్పాను. నేను మాట్లాడిన మాటలపై నా స్టాండ్ నాకు ఉంది’ అని జగ్గారెడ్డి అన్నారు.

Covid-19 Origins : కొవిడ్ పుట్టుక.. వైరస్ మూలాలను ఎప్పటికీ గుర్తించ‌లేం.. జీవాయుధం కానేకాదు!

”రెండు ప్రాంతాలు కలిసి ఉండాలని చెప్పా. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన తరువాత కూడా నా వాయిస్ వినిపించా. గతంలో నేను చెప్పిన విషయాన్నే ఇప్పుడు అందరూ అంటున్నారు. రెండు రాష్ట్రాలు కలుపుతా అంటే కేసీఆర్ కు సంపూర్ణ మద్దతిస్తా” అని జగ్గారెడ్డి అన్నారు.