Basara Saraswati Temple : బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు.. ఉలిక్కిపడ్డ భక్తులు

అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు బ్లాస్టింగ్ శబ్దాలతో ఆందోళన చెందారు.

Basara Gnana Saraswati Temple

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుళ్ల కలకలం రేగింది. భారీ పేలుళ్లు, శబ్దాలతో భక్తులు ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు బ్లాస్టింగ్ శబ్దాలతో ఆందోళన చెందారు. ఆలయ అభివృద్ది పనుల్లో భాగంగా దక్షిణవైపు ఉన్న గుట్టను తొలగిస్తున్నారు అధికారులు.

అయితే, పిల్లర్ల కోసం బండరాళ్లను జిలెటిన్ స్టిక్స్ తో పేల్చేశారు. ఈ సమయంలో భారీ శబ్దాలు రావడంతో భక్తులు ఉలిక్కిపడ్డారు. కొన్ని బండరాళ్లు ఎగిరిపడ్డాయి. కొందరికి గాయాలు అయ్యాయి. ఓ భక్తుడి కారు అద్దం కూడా పగిలిపోయింది. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని భక్తులు మండిపడుతున్నారు.

Also Read : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చేసిన హెచ్చరిక ఏంటి?

బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి సంబంధించి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆలయానికి దక్షిణం వైపు రాళ్లతో కూడిన గుట్ట ఉంది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఆ గుట్టను తొలగించాల్సి ఉంది. వాస్తవానికి ఆలయాలు, పురాతన క్షేత్రాల సమీపంలో పునర్ నిర్మాణ పనులు చేసేటప్పుడు పేలుడు పదార్దాలు కానీ జిలెటిన్ స్టిక్స్ కానీ వాడకూడదు అనే నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ, బాసర ఆలయం దగ్గర జరుగుతున్న పనుల్లో కొంత నిర్లక్ష్యం కనిపించింది. బండరాళ్లను తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్ వాడారు. అయితే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల బండరాళ్లు ఎగిరిపడి కొందరికి గాయాలయ్యాయి.

ఇవాళ ఆదివారం. కార్తీక మాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి కొందరు రాగా, అక్షరభాస్యం చేయించడానికి మరికొందరు వచ్చారు. అయితే, ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దాలు రావడంతో భక్తులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అర్థం కాక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొన్ని రాళ్లు ఎగిరిపడ్డాయి. ఓ భక్తుడి కారుపై రాయి పడటంతో అద్ధం పగిలిపోయింది. దీనిపై భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు.

బండరాళ్లను తొలగించే విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని భక్తులు కోప్పడ్డారు. పేలుడు సమయంలో అసలు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి ప్రమాదకర పనులు చేయడం భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అంటున్నారు. నిజానికి.. ఇలాంటి పనులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేయాల్సి ఉంటుంది. కానీ, నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీరియస్ అయ్యారు. రాళ్లు చిన్నపిల్లల మీద పడుంటే ఘోరం జరిగిపోయి ఉండేదన్నారు. ఇది కరెక్ట్ కాదని, ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : ఒక్క క్రిమినల్ కూడా లేని ముగ్గురు తెలంగాణ మంత్రులు వీరే..

వాస్తవానికి బండ రాళ్లను తొలగించే పనుల్లో లెటిన్ స్టిక్స్ లేదా పేలుడు పదార్దాలు వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు అలాంటి పనులను అర్థరాత్రి సమయంలో చేయాల్సి ఉంటుంది. అందరినీ అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, అలాంటి జాగ్రత్తలు ఏవీ పాటించకుండానే బండరాళ్లు పేల్చారు.