Karimnagar Bomb Commition
karimnagar : కరీంనగర్‌లో బాంబు కలకలం రేపింది. నగరంలోని ప్రముఖ వస్త్ర దుకాణం మాంగళ్యలో బాంబు పెట్టామని ఆగంతకుడు ఈ రోజు మధ్యాహ్నం షాపుకు ఫోన్ చేసి చెప్పాడు. ఆందోళన చెందిన షాపు యాజమాన్యం మైకులో ఈ విషయం తెలియ పరిచింది.
దీంతో షాపులోని వారంతా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు షాపింగ్ మాల్‌కు వచ్చి తనిఖీలు చేపట్టారు. ఎక్కడా బాంబు లభించక పోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి అది ఫేక్‌కాల్‌గా గుర్తించి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Also Read :South West Monsoon : అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు