Shamshabad Airport Bomb : వీడెవడండీ బాబూ.. ఆ కోపంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

హైదరాబాద్ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్-చెన్నై ఇండిగో ఫ్లైట్ లో బాంబు పెట్టామంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

Shamshabad Airport Bomb : హైదరాబాద్ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్-చెన్నై ఇండిగో ఫ్లైట్ లో బాంబు పెట్టామంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎయిర్ పోర్టు సిబ్బంది అలర్ట్ అయ్యారు. సీఐఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. బాంబు స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ తో ఎయిర్ పోర్టులో ముమ్మరంగా తనిఖీలు చేశారు.

Also Read..Woman Killed Husband And Aunt : ప్రియుడితో కలిసి భర్త, అత్తను హత్య చేసిన వివాహిత.. మృతదేహాలను ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచిన మహిళ

అయితే ఎలాంటి బాంబును గుర్తించ లేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, అది ఫేక్ కాల్ అని తెలుసుకున్నారు. అంతేకాదు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎయిర్ పోర్టులోనే ఉన్నట్లు, అతడు చెన్నైలో సీనియర్ ఇంజినీర్ గా పని చేస్తున్న అజ్మీరా భద్రయ్యగా గుర్తించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు షాకింగ్ విషయం చెప్పాడు.

Also Read..Nikki Yadav case: నిందితుడు గెహ్లాట్ తండ్రి కూడా 25 ఏళ్ల క్రితం మరో హత్య కేసులో అరెస్టు

లేటుగా రావడంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది భద్రయ్యను ఎయిర్ పోర్టులోనికి అనుమతించ లేదు. దీంతో కోపంతో ఊగిపోయిన అతడు.. ఈ బెదిరింపు కాల్ చేసినట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసి ఎయిర్ లైన్స్ సిబ్బంది, ప్రయాణికులు నివ్వెరపోయారు. వీడెవడండీ బాబూ అని తల పట్టుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.