Nikki Yadav case: నిందితుడు గెహ్లాట్ తండ్రి కూడా 25 ఏళ్ల క్రితం మరో హత్య కేసులో అరెస్టు

ఢిల్లీలో నిక్కీ యాదవ్ అనే యువతిని గొంతునులిమి చంపి, ఆమె మృతదేహాన్ని ఫ్రిడ్జిలో దాచిన ఆమె ప్రియుడు సాహిల్ గెహ్లాట్ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులకు అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సాహిల్ గెహ్లాట్ తండ్రి కూడా 25 ఏళ్ల క్రితం ఓ హత్య కేసులో అరెస్టయ్యాడని పోలీసులు గుర్తించారు. గెహ్లాట్ తండ్రి పేరు వీరేందర్ సింగ్ అని పోలీసులు చెప్పారు.

Nikki Yadav case: నిందితుడు గెహ్లాట్ తండ్రి కూడా 25 ఏళ్ల క్రితం మరో హత్య కేసులో అరెస్టు

Nikki CCTV footage

Nikki Yadav case: ఢిల్లీలో నిక్కీ యాదవ్ అనే యువతిని గొంతునులిమి చంపి, ఆమె మృతదేహాన్ని ఫ్రిడ్జిలో దాచిన ఆమె ప్రియుడు సాహిల్ గెహ్లాట్ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులకు అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సాహిల్ గెహ్లాట్ తండ్రి కూడా 25 ఏళ్ల క్రితం ఓ హత్య కేసులో అరెస్టయ్యాడని పోలీసులు గుర్తించారు. గెహ్లాట్ తండ్రి పేరు వీరేందర్ సింగ్ అని పోలీసులు చెప్పారు.

గెహ్లాట్ కుటుంబ సభ్యులు కూడా నిక్కీ యాదవ్ హత్య కేసులో ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. వారిని విచారిస్తున్న సమయంలోనే గెహ్లాట్ తండ్రి వీరేందర్ సింగ్ కు నేర చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 25 ఏళ్ల క్రితం ఒకరి హత్య కేసులో వీరేందర్ సింగ్ జోక్యం ఉందని, అతడిని అప్పట్లో పోలీసులు అరెస్టు చేసి విచారించారని అన్నారు.

కాగా, నిక్కీ యాదవ్ ది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నానని, ఇంతలోనే పోలీసులు ఆమె హత్య ఉదంతాన్ని గుర్తించారని గెహ్లాట్ పోలీసుల విచారణలో తెలిపాడు. నైరుతి ఢిల్లీ నజాఫ్‌గఢ్‌లో నిక్కీ యాదవ్ హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిక్కీ యాదవ్ తో ప్రేమాయణం కొనసాగిస్తూనే గెహ్లాట్ మరో అమ్మాయిని అతడు పెళ్లి చేసుకున్నాడు. అతడి పెళ్లికి ముందు రోజు నిక్కీ యాదవ్, గెహ్లాట్ కు గొడవ జరిగింది. దీంతో ఆమెను గొంతునులిమి చంపి, ఆమె మృతదేహాన్ని ఫ్రిడ్జిలో పెట్టాడు గెహ్లాట్.

Woman Killed Husband And Aunt : ప్రియుడితో కలిసి భర్త, అత్తను హత్య చేసిన వివాహిత.. మృతదేహాలను ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచిన మహిళ