Site icon 10TV Telugu

KCR: కేసీఆర్ కీలక సమావేశం.. ముఖ్య నేతలు హాజరు.. కవిత అంశంపై చర్చ..!

MLC Kavitha letter to BRS chief KCR

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఇందులో మాజీ మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డిలతో పాటు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కవిత అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఉదయం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితోనూ కేసీఆర్ సమావేశం అయ్యారు. అయితే, ఇందులో కవిత అంశం చర్చకు రాలేదని జగదీశ్ రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్సీ కవిత అంశం బీఆర్ఎస్ లో వివాదాస్పదంగా మారింది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, పార్టీ కీలక నేతలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో కీలక నేతలతో కేసీఆర్ సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో కవిత అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రోజురోజుకి కవిత అంశం పార్టీలో వివాదాస్పదంగా మారుతుండటంతో ఇటు నాయకులు, అటు కార్యకర్తలు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారకముందే కవిత విషయంలో కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోవాలని నాయకులు, కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తోంది.

ఈ ఉదయం కేసీఆర్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇప్పుడు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డిలతో సమావేశం అయ్యారు. దీంతో ఏం జరగనుంది? కవిత విషయంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఏంటి? అనే దానిపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

Also Read: రేవంత్‌ సన్నిహితుడికా? ఏఐసీసీ చెప్పిన నేతకా? ఆ నలుగురిలో జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి..

Exit mobile version