Gossip Garage: రేవంత్ సన్నిహితుడికా? ఏఐసీసీ చెప్పిన నేతకా? ఆ నలుగురిలో జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి..
మైనార్టీని కాకుండా ఎవరిని బరిలో దింపినా తమకు అభ్యంతరం లేదని ఎంఐఎం చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మైనార్టీని బరిలో దింపితే...అతను గెలిస్తే ఏకంగా..

Gossip Garage: ఒక్క బైపోల్. టికెట్ రేసులో దాదాపు పది మంది ఆశావహులు. పైగా రేవంత్ వర్గం..అధిష్టానం మనుషులు అంటూ వేరియేషన్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ రేసుగుర్రం ఎవరు? పొన్నం కామెంట్స్ కొత్త రచ్చకు దారి తీశాయా? రేవంత్ సన్నిహితుడే అభ్యర్థి కాబోతున్నారా? అధిష్టానం మనిషికే టికెట్ దక్కబోతోందా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతోంది. గ్రేటర్‌లో రెండో బైపోల్‌లో గెలిచి సత్తా చాటాలనుకుంటున్న కాంగ్రెస్‌కు ఆశావహుల వడపోత కష్టంగా మారుతోందట. ఒక్క బైపోల్ టికెట్ కోసం ఏకంగా పది మంది నేతలు పోటీ పడుతుండటంతో పాటు..అందులో రెండు మూడు వర్గాలుగా విడిపోయారట టికెట్ యాస్పిరెంట్స్.
సీఎం రేవంత్ వర్గంగా ఇద్దరు నేతలు రంగంలోకి దిగుతుండగా.. అధిష్టానం మనుషులుగా మరికొందరు, పలువురు సీనియర్ మంత్రుల సన్నిహితులుగా ఇంకొందరు టికెట్ ఫైట్‌లో జోరు పెంచారట. ఈ నేపథ్యంలో టికెట్ దక్కేదెవరికి? జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ రేసుగుర్రం ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది.
ఇప్పటికే హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు మరో ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్‌లకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది. మంత్రులకు మరింత సహకారం అందించేందుకు ఒక్కొక్క మంత్రికి ముగ్గురు చొప్పున కార్పొరేషన్ ఛైర్మన్లకు బాధ్యతలు ఇచ్చింది. ఇంత సీరియస్‌గా ఫోకస్ పెట్టిన అధికార పార్టీ నుంచి టికెట్ దక్కించుకోవడానికి అనేక మంది నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ లోకల్ లీడర్‌కే టికెట్ ఇస్తామన్న మంత్రి పొన్నం కామెంట్స్‌తో రచ్చ స్టార్ట్ అయింది. టికెట్ ఆశిస్తున్న ఫిరోజ్‌ఖాన్ మంత్రి పొన్నం కామెంట్స్‌ను తప్పుపట్టారు. ఏకంగా వయనాడ్, రాయ్‌బరేలీలో రాహుల్, ప్రియాంక లోకలా అంటూ ఫిరోజ్‌ఖాన్ ప్రశ్నించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే పొన్నం లోకల్ కామెంట్ కారణంగానే మరో ఇద్దరు మంత్రులకు బైపోల్ బాధ్యతలు అప్పగించినట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తోంది.
జూబ్లీహిల్స్ బరిలో నిలిచేందుకు చాలామంది నేతలు పోటీ పడుతున్నా చివరికి నలుగురి నేతల మీదనే ప్రధానంగా ఫోకస్ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్, నవీన్ యాదవ్‌తో పాటు సీఎంకు అత్యంత సన్నిహితులైన ఫఈమ్ ఖురేషీ, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పేర్లు రేసులో వినిపిస్తున్నాయి.
Also Read: గొర్రెల పంపిణీ స్కామ్‌లో వాట్ నెక్స్ట్? ఈడీ దర్యాప్తుతో బీఆర్ఎస్‌లో గుబులు..
అజారుద్దీన్ కు ఎంఐఎం సపోర్ట్ చేయకపోవచ్చన్న భయం..!
జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఎంఐఎం మద్దతు కాంగ్రెస్‌కు కీలకంగా మారింది. దీంతో పతంగి పార్టీ పెద్దలకు నచ్చిన నేతకే హస్తం పార్టీ టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ అయితే ఎంఐఎం సపోర్ట్ చేయకపోవచ్చన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ కాదు కూడదని కాంగ్రెస్ అజారుద్దీన్‌ను బరిలోకి దింపితే..ఎంఐఎం పోటీకి నిలిచే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.
గెలిస్తే ఏకంగా మంత్రి అయ్యే ఛాన్స్..!
మైనార్టీని కాకుండా ఎవరిని బరిలో దింపినా తమకు అభ్యంతరం లేదని ఎంఐఎం చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మైనార్టీని బరిలో దింపితే…అతను గెలిస్తే ఏకంగా మంత్రి అయ్యే ఛాన్స్ ఉండటంతో ఎంఐఎం కీ రోల్ ప్లే చేస్తోందనే టాక్ నడుస్తోంది. దీంతో అజారుద్దీన్ విషయంలో కాంగ్రెస్ ఆలోచనలో పడిందంటున్నారు. ఇక మరో మైనారిటీ నేత సీఎం రేవంత్‌కు సన్నిహితుడైన ఫయిమ్ ఖురేషీకి అయితే ఎంఐఎం సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉందంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఫయిమ్ ఖురేషీపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో..ఫయిమ్‌కు సీఎం మద్దతు ఉన్నప్పటికీ సీనియర్లు విముఖత చూపుతున్నారట.
ఇక జూబ్లీహిల్స్ టికెట్ రేసులో సీఎంకు అత్యంత సన్నిహితుడైన ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రోహిన్ రెడ్డి కూడా ఎన్నికల బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్నారట. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు కూడా ఉండటంతో టికెట్ దక్కించుకోవాలని గట్టి కసరత్తు చేస్తున్నారు. ఇక లోకల్ చంటిగా పేరొందిన నవీన్ యాదవ్ ఉప ఎన్నికల సీటు విషయంలో గంపెడాశలు పెట్టుకున్నారు.
ఆ ఇద్దరు లోకల్స్ లో టికెట్ దక్కేదెవరికి?
జూబ్లీహిల్స్‌లో టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. సామాజిక సమీకరణాల ప్రకారం కూడా కలిసొస్తుందని ఆశిస్తున్నారు. పార్టీ కూడా లోకల్ లీడర్లకే టికెట్ ఇవ్వాలని భావిస్తోందట. అందుకు అనుగుణంగా ఎన్నికల ఇంచార్జ్‌గా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో మైనార్టీ నేతలను మినహాయిస్తే..రోహిన్‌రెడ్డి, నవీన్ యాదవ్ హైదరాబాద్ లోకల్ లీడర్లు. వీరిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది.