Bandari Narendar : జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ ర్యాలీలో విషాదం.. కౌన్సెలర్ రజనీ భర్త బండారి నరేందర్ మృతి

గాంధీనగర్ దగ్గర నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ నరేందర్ స్పృహ కోల్పోయారు. హుటాహుటినా అయన్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Bandari Narendar : జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ ర్యాలీలో విషాదం.. కౌన్సెలర్ రజనీ భర్త బండారి నరేందర్ మృతి

Bandari Narendra

Updated On : April 1, 2023 / 2:16 PM IST

Bandari Narendar : జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ ర్యాలీలో విషాదం నెలకొంది. బీఆర్ఎస్ కౌన్సిలర్ రజనీ భర్త బండారి నరేందర్ మృతి చెందారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో భాగంగా ర్యాలీ నిర్వహించారు. గాంధీనగర్ దగ్గర నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ నరేందర్ స్పృహ కోల్పోయారు.

Man dies while dancing: డ్యాన్స్ చేస్తూ మృతి చెందిన వ్యక్తి.. వీడియో వైరల్

హుటాహుటినా అయన్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరేందర్ మృతి చెందారు. ఆయన మృతితో కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు కన్నీరుమున్నీరవుతున్నారు.