BRS Leader KTR Slams Kadiam Srihari for Leaving BRS Party
KTR Comments : బీఆర్ఎస్ పార్టీని వీడిన కడియం శ్రీహరిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేసి పదేళ్లలో మూడు చట్ట సభలకు పంపితే.. కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చాడని ఆయన ఆరోపించారు. మంగళవారం (ఏప్రిల్ 23) వర్ధన్నపేట బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత నేతలను కడియం పార్టీ నుంచి సాగనంపాడని, ఇంట్లో భోజనం చేసి… ఫోటోలు దిగి వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. కావ్య భర్త కూడా కేసిఆర్‌ను చూసి ఫ్యాన్ అయ్యాడని కేటీఆర్ అన్నారు. సంవత్సరం లోపే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టువేసి మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. బాసర.. యాదాద్రికి పోయి దేవుళ్ల మీద ఒట్టు వేశాడని, వరంగల్ భద్రకాళి అమ్మవారు డేంజర్.. వదిలి పెట్టదన్నారు.
ఈ ఎన్నికలు సామాన్యమైన ఎన్నికలు కాదని కేటీఆర్ చెప్పారు. వంద రోజులు అబద్దానికి.. పదేళ్ల నిజానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా పేర్కొన్నారు. వరంగల్‌లో జరుగుతున్నది విశ్వాస ఘాతకులు.. నికార్సైన ఉద్యమకారుడి మద్య జరుగుతున్న పోరుగా కేటీఆర్ అభివర్ణించారు.
Read Also : YS Jagan: చంద్రబాబుకి ఆ పార్టీ పరోక్షంగా మద్దతు ఇస్తోంది: జగన్