Mlc Kavitha : కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట.. ఆ అభ్యర్థనకు ఆమోదం

కస్టడీలో ఉన్న 7 రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు పర్మిషన్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు.

Mlc Kavitha Petition

Mlc Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. తల్లిని మరి కొంతమంది కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని పిటిషన్ లో ఆమె విజ్ఞప్తి చేశారు. తల్లితో పాటు తన పిల్లలను, మరికొందరిని కలిసేందుకు అనుమతి కోరారు కవిత. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు. తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య.. సోదరీమణులు అఖిల సౌమ్య వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డిలను కలుసుకునేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు కవిత. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తల్లి, కుమారులను కలిసేందుకు కవితకు అనుమతి ఇచ్చారు.

ప్రస్తుతం మూడోరోజు ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు. ఈడీ కస్టడీకి అనుమతించిన రోజు భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు, కజిన్ బ్రదర్స్ పి శ్రీధర్, ప్రణీత్ కుమార్, పీఏ శరత్ చంద్రలను కలుసుకునేందుకు కవితను అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. కస్టడీలో ఉన్న 7 రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు పర్మిషన్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు.

అయితే, ఎక్కువమంది కలవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని కోర్టు పేర్కొంది. దీంతో ముందుగా అనుమతించిన వారిలో కేటీఆర్ పేరుతో పాటు తల్లి కుమారులు, సోదరీమణులు అఖిల సౌమ్య వినుత సోదరుడు ప్రశాంత్ రెడ్డిలను కలిసేందుకు అనుమతించాలని కవిత తరపు న్యాయవాదులు కోరారు. దీనికి రౌస్ అవెన్యూ కోర్టు అంగీకారం తెలిపింది.

కస్టడీ డే-3.. కవితపై ప్రశ్నల వర్షం..
మరోవైపు 3వ రోజు కస్టడీలో కవితను విచారించారు ఈడీ అధికారులు. ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో ఈడీ అధికారులు కవితను ఎంక్వైరీ చేశారు. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత పాత్ర, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూపులో కవిత పాత్ర, సిసోడియా-కేజ్రీవాల్ తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను ప్రశ్నించారు అధికారులు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు.

Also Read : పార్టీ మారిన ఆ ఐదుగురు నేతలకు లక్కీ ఛాన్స్..! 9మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రెడీ..!

 

ట్రెండింగ్ వార్తలు