BRS Victory : రాజన్నసిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా.. నేడు చైర్మన్ ఎన్నిక

రాజన్నసిరిసిల్ల జిల్లా విద్యుత్ సహకార సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. 15 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. 15 డైరెక్టర్ స్థానాల్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.

BRS Victory : రాజన్నసిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా.. నేడు చైర్మన్ ఎన్నిక

CESS

Updated On : December 27, 2022 / 9:35 AM IST

BRS victory : రాజన్నసిరిసిల్ల జిల్లా విద్యుత్ సహకార సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. 15 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. 15 డైరెక్టర్ స్థానాల్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 2 స్థానాల్లో రీకౌంటింగ్ చేయాలని బీజేపీ పట్టుబట్టింది. దీంతో వేములవాడ రూరల్, చందుర్తి స్థానాల్లో రీకౌంటింగ్ నిర్వహించారు. రాత్రి 11.15 గంటల వరకు కౌంటింగ్ కొనసాగింది. రెండు చోట్లా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు.

వేములవాడ రూరల్ స్థానంలో మూడు ఓట్లతో దేవ్ రాజ్, చందుర్తిలో రెండు ఓట్ల తేడాతో శ్రీనివాస్ రావు విజయం సాధించారు. దీంతో సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. సెస్ ఎన్నికలు బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కౌంటింగ్ కేంద్రం ఇరు పార్టీల కార్యకర్తుల బాహాబాహీకి దిగారు. రెండు స్థానాల్లో రీ కౌంటింగ్ కు అధికారులు ఆదేశించడంతో మరోసారి ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు బీఆర్ఎస్, బీజేపీ నేతలు, కార్యర్తలను కౌంటింగ్ కేంద్రం నుంచి పంపించవేశారు.

Cess Election In Telangana : హీట్ పుట్టిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ‘సెస్’ ఎన్నికలు

సెస్ ఎన్నికల ఫలితాలను అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా ప్రధాన పార్టీలు తీసుకోవడంతో గతంలో ఎన్నడూ జరగని రేంజ్ లో ప్రచారం జరిగింది. మంత్రి కేటీఆర్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సెస్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విజయం కోసం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఓ రేంజ్ లో ప్రచారం చేశారు. దీంతో పోలింగ్, ఫలితాల్లో కూడా అదే టెన్షన్ కొనసాగింది.

అయితే ఫలితాల్లో కాంగ్రెస్ పూర్తిగా డీలా పడింది. అన్ని స్థానాలను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు
గెలుచుకోవడంతో సెస్ పై గులాబీ జెండా రెపరెపలాడింది. నేడు సెస్ చైర్మన్ ఎన్నిక జరుగనుంది. సెస్ చైర్మన్ ఎవరనేది ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రకటించనున్నారు. చిక్కాలకే సెస్ చైర్మన్ అవకాశాలు ఉన్నాయి.