Road Accident
Road Accident : నగర శివార్లలోని కొంపల్లిలో (Kompally) రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లిలోని బిగ్ బజార్ వద్ద ఆదివారం అర్ధరాత్రి మితిమీరిన వేగంతో కారు డివైడర్‌ను (Divider) ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో కారు మూడు ఫల్టీలు కొట్టినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
చదవండి : Road Accident : శుభకార్యానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. తల్లీకూతురు మృతి
వీరు అర్ముర్ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లుగా సమాచారం. కారులోని వారు మద్యం సేవించి ఉన్నారని పోలీసులు నిర్దారించారు. మద్యం మత్తులో కారును వేగంగా నడిపి ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు.
చదవండి : Auto Accident : నెల్లూరు జిల్లా బీరాపేరు వాగులో ఆటో పడిన ఘటన..ముగ్గురి మృతదేహాలు లభ్యం