Samul Prasad : రిటైర్డ్ ఐఆర్ఎస్ శాముల్ ప్రసాద్ ఇంట్లో చోరీ కేసులో రోజుకో మలుపు
ఇప్పటికే ఈ కేసులో సురేందర్ ను పోలీసులు విచారించి కీలక వివరాలు సేకరించారు. ఎస్ఐ కృష్ణకు రంగారెడ్డి జిల్లా పాత నేరస్తుడు శ్రీశైలంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆశీర్వాదం సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.

Samul Prasad
House Theft Case : రిటైర్డ్ ఐఆర్ఎస్ శాముల్ ప్రసాద్ ఇంట్లో చోరీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శ్యాముల్ ఆస్తి పత్రాల చోరీకి స్కెచ్ వేసిన ఎస్ఐ కృష్ణకు మరో నలుగురు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. వారిలో ఇద్దరు వ్యక్తులను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. మరో ఇద్దరి పాత్రపై ఆరా పోలీసులు తీస్తున్నారు.
ఇప్పటికే ఈ కేసులో సురేందర్ ను పోలీసులు విచారించి కీలక వివరాలు సేకరించారు. ఎస్ఐ కృష్ణకు రంగారెడ్డి జిల్లా పాత నేరస్తుడు శ్రీశైలంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆశీర్వాదం సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరు వ్యక్తులను ప్రస్తుతం విచారిస్తున్నట్లు సమాచారం.
నార్సింగ్ లో ఓ అపార్ట్ మెంట్ నిర్మాణం చేస్తున్నప్పుడు శ్యామలతో ఆశీర్వాదంకు పరిచయం ఏర్పడింది.
ISKP Terror Organization : ఐఎస్ కేపీ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల విచారణలో కీలక అంశాలు
శ్యాముల్, ఆశీర్వాదం వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. పాత నేరస్తుడు శ్రీశైలం సహాయంతో సుమలత అనే మహిళను ఎస్ఐ కృష్ణ శామల్ ఇంట్లో పని మనిషిగా చేర్పించారు. దీంతో ఎస్ఐ కృష్ణతో ఉన్న పరిచయాలున్న వ్యక్తులు, సహకరించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.