పోచారం నివాసం వద్ద అరెస్టయిన బాల్క సుమన్, ఇతర నేతలపై కేసులు.. వైద్య పరీక్షలు పూర్తి..

BRS leaders: పోలీస్ డ్యూటీని అడ్డుకోవడం, అక్రమ చొరబాటు, ఒకే ఉద్దేశంతో గుంపులుగా వచ్చి దాడి చేయడం..

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, మన్నె గోవర్ధన్, దూదిమెట్ల బాలరాజు, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌, ఇతర నేతలపై 353, 448 రెడ్ విత్ 34ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

మరికాసేపట్లో వారిని రిమాండ్ కు తరలించనున్నారు బంజారాహిల్స్ పోలీసులు. పోలీస్ డ్యూటీని అడ్డుకోవడం, అక్రమ చొరబాటు, ఒకే ఉద్దేశంతో గుంపులుగా వచ్చి దాడి చేయడం వంటి కేసులు వారిపై పెట్టారు. 12 మంది బీఆర్ఎస్ నేతలను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

వైద్య పరీక్షల అనంతరం వారిని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. కాగా, పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. పోచారం ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడం పట్ల బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నేతలను భయపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి లాగుతున్నారని అంటున్నారు.

Also Read: ఆయన ఇంటికి వెళ్లిన మా పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారు: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు