ఆయన ఇంటికి వెళ్లిన మా పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారు: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

Jagadish Reddy: గతంలో కంటే వైభవంగా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని జగదీశ్ రెడ్డి అన్నారు.

ఆయన ఇంటికి వెళ్లిన మా పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారు: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

Jagadish Reddy

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లిన తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. పోచారం పార్టీ మారతారని తాము ఊహించలేదని అన్నారు. తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని పోచారం స్వయంగా చెప్పారని తెలిపారు.

గతంలో కంటే వైభవంగా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని జగదీశ్ రెడ్డి అన్నారు. సింగరేణిపై ప్రత్యక్ష పోరాటం చేసేందుకు కార్యాచరణ ఉంటుందని తెలిపారు. తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ అని మరోసారి స్పష్టమైందని చెప్పారు. తెలంగాణ హక్కులను కాంగ్రెస్ ధారాదత్తం చేస్తోందని అన్నారు.

కేఆర్ఎంబీ విషయంలో ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరించిందని, తమ పోరాటంతో సర్కారు వెనక్కి తగ్గిందని జగదీశ్ రెడ్డి తెలిపారు. గోదావరి జలాలపై మాజీ సీఎం కేసీఆర్ హెచ్చరించడంతో దిగి వచ్చిందని అన్నారు. సింగరేణి వేలంపై ఆందోళన చేస్తామని ప్రకటిస్తే కాంగ్రెస్ సర్కారు ఆత్మరక్షణలో పడిందని, అందుకే మాట మార్చిందని తెలిపారు.

కాంగ్రెస్, బీజేపీ మిత్రత్వం వేలం దగ్గర బయట పడిందని జగదీశ్ రెడ్డి అన్నారు. శ్రావణి బ్లాక్‌ను వేలంలో ఉంచినట్లో, తీసేసినట్లో చెప్పాలని అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలపాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా తొలిసారి తెలంగాణకు వచ్చి కిషన్ రెడ్డి రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపించారు.

నిన్న ఈడీ సోదాలు.. ఇవాళ ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడి ఇంటికి హరీశ్ రావు.. కీలక వ్యాఖ్యలు