Indiramma housing scheme
Indiramma housing scheme: ఇందిరమ్మ హౌసింగ్ స్కీం కింద లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసింది. తొలి విడతలో ఇంటి స్థలం ఉండి.. ఇల్లు కట్టుకునే వారికి ప్రాధాన్యత నిచ్చింది. ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలను అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మొత్తాన్ని నాలుగు విడతల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం అందించనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది.
Also Read: Ration Card : కొత్త రేషన్ కార్డులకోసం అప్లయ్ చేశారా.. మీకోసం బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్లకు మూడు రంగుల విషయంలో నాటి ప్రభుత్వం అంత పట్టుదలగా వ్యవహరించలేదు. దీంతో కొన్ని ఇళ్లకు మూడు రంగులతో కూడిన చారలను నామమాత్రంగా ఏర్పాటు చేశారు. కొన్నింటికి మూడు రంగుల గుర్తులు వేయలేదు. అయితే, రేవంత్ సర్కార్ మాత్రం ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన ఇంటిపై కచ్చితంగా మూడు రంగులు ముద్రించడాన్ని తప్పనిసరి చేసింది. దీంతో ఇంటి యాజమానుల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా కచ్చితంగా మూడు రంగులు ముద్రించాల్సి ఉంటుంది. ఇళ్లు ఏ డిజైన్ లో నిర్మించినా ఇంటి పైభాగంలో మాత్రం మూడు రంగులు ఉండేలే ఆదేశాలిచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేసే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడతామంటే ఒక్కపైసా కూడా కేంద్రం నుంచి ఇచ్చే ప్రసక్తి లేదని అన్నారు. మోదీ సర్కార్ మంజూరు చేసే ఇళ్లకు ఇందిరమ్మ పేరెలా పెడతారని ప్రశ్నించారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులతో చేపట్టిన ఇళ్లపై కచ్చితంగా ఆ పథకం లోగోను ముద్రించాలని ఆదేశించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇళ్లకు సాయం చేస్తుందో అన్ని ఇళ్లకు ఈ లోగా ఉండాల్సిందేనని ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.