Ration Card : కొత్త రేషన్ కార్డులకోసం అప్లయ్ చేశారా.. మీకోసం బిగ్ బ్రేకింగ్ న్యూస్

పాత రేషన్ కార్డుల్లో పెండెన్సీ దరఖాస్తులు కొత్త సమస్య తెచ్చిపెడుతున్నాయి.

Ration Card : కొత్త రేషన్ కార్డులకోసం అప్లయ్ చేశారా.. మీకోసం బిగ్ బ్రేకింగ్ న్యూస్

CM Revanth Reddy

Updated On : February 26, 2025 / 1:20 PM IST

Ration card: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే కార్డుల పంపిణీని ప్రారంభించాలని యోచిస్తోంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం, రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకోసం దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. అర్హుల జాబితాను సిద్ధం చేశారు. అయితే, జీహెచ్ఎంసీ పరిధిలో పాత రేషన్ కార్డుల్లో పెండెన్సీ దరఖాస్తులు కొత్త సమస్య తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే చేర్పులు, మార్పుల కోసం చేసుకున్న దరఖాస్తులు క్లియర్ అయితే తప్ప కొత్తగా అర్జీలు పెట్టుకునేందుకు వెసులుబాటు లేకుండా పోయింది.

Also Read: వావ్.. వండర్ ఫుల్.. అడ్వాన్స్ టెక్నాలజీ, చిప్ తో రేషన్ కార్డులు.. ఇక జస్ట్ స్వైప్ చేస్తే చాలు.. ఎప్పటి నుంచంటే..

గతంలో ఓ కుటుంబం కొత్తగా కాపురానికి వచ్చిన మహిళ పేరును కుటుంబంలోని తెల్ల రేషన్ కార్డులో చేర్పించేందుకు దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమోదం లభించలేదు. ప్రస్తుతం.. ఆ కుటుంబం వేరుపడటంతో.. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆ ధరఖాస్తు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నట్లు ఆన్ లైన్ లో చూపిస్తుంది. ఇలా జరగడానికి ప్రధాన కారణం గతంలో దరఖాస్తు చేసుకోవటమేనని తెలుస్తోంది. పెండింగ్ దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణ జరిగితే కానీ, కొత్త దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇలా హైదరాబాద్ నగరంలో లక్షల మంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

 

గ్రేటర్ పరిధిలో సుమారు 17,21,603 రేషన్ కార్డులు ఉండగా.. అందులో 59,00,584 సభ్యులు ఉన్నారు. వీరిలో సుమారు మూడు లక్షల కుటుంబాలు తొమ్మిది లక్షల కొత్త సభ్యుల పేర్ల నమోదుకోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆన్ లైన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పులుకోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగిస్తూనే.. ఆమోదించే ఆప్షన్ ను మాత్రం ప్రభుత్వం నిలిపివేసింది. ఆమోదం లేకపోవటంతో నిరుపేద కుటుంబాలు మీ సేవ, పౌరసరఫరాల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది.