Telangana Formation Day 2023: ఎన్నో పనులు చేయాలనుకున్నాం.. కానీ..: చంద్రబాబు

"రైతులను సంపద సృష్టిలో భాగస్వామ్యం చేయాలనుకున్నాం. రాజధాని కంటిన్యూ అయి ఉంటే ఇప్పటికే రూ. 2 లక్షల కోట్ల సంపద వచ్చుండేది" అని చంద్రబాబు అన్నారు.

Chandrababu

Telangana Formation Day 2023 – Chandrababu: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇవాళ అమరావతి(Amaravati)లో ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 2.. ఏపీ (Andhra Pradesh) రెండు రాష్ట్రాలుగా విడిపోయిన రోజని చెప్పారు.

“విభజన జరిగి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. తెలుగు జాతి అగ్ర స్థానంలో ఉండాలి. తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ టీడీపీ. రెండు రాష్ట్రాలూ అభివృద్ధి కావాలి. రెండు రాష్ట్రాల్లోనూ విభిన్న పరిస్థితులుంటాయి.. దానికి అనుగుణంగా విజన్ తయారు చేసుకోవాలి. విభజన నాటికి రెవెన్యూ డెఫిసిట్ రూ.16 వేల కోట్లు. విద్యుత్ కొరత, అప్పులతో రాష్ట్రం ఏర్పడింది.

ఏపీలో నవ నిర్మాణ దీక్షల పేరుతో ఏపీలో ఇబ్బందులను అధిగమించే దిశగా చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాం. సన్ రైజ్ ఏపీగా మార్చాం. పోలవరం ద్వారా నదుల అనుసంధానంతో ఏపీని సస్యశ్యామలం చేయాలనుకున్నాం. రూ.64 వేల కోట్లతో సాగు నీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టాం. నవ్యాంధ్ర కోసం 2029 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.

మధ్యలో రాజధాని పెట్టాం. 33 వేల ఎకరాల్లో అత్యధికంగా వివాదాల్లేని భూమిలు ఇచ్చారు. రైతులను సంపద సృష్టిలో భాగస్వామ్యం చేయాలనుకున్నాం. రాజధాని కంటిన్యూ అయ్యుంటే ఇప్పటికే రూ. 2 లక్షల కోట్ల సంపద వచ్చుండేది. అమరావతిని విచ్ఛిన్నం చేసింది ఈ ప్రభుత్వం. తొమ్మిదేళ్ల తర్వాత కూడా ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు. నీతి ఆయోగ్ సూచనల మేరకే పోలవరం నిర్మాణం ఏపీకి అప్పజెప్పారు.

72 శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశాక.. పోలవరాన్ని జగన్ రివర్స్ చేశారు. ఈ ప్రభుత్వ నిర్లక్యం వల్ల డయా ఫ్రం వాల్ దెబ్బతింది. ఇప్పుడు 41.15 మీటర్లకే నీటి నిల్వ చేస్తున్నామంటున్నారు. 45.82 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయగలిగితేనే పోలవరం వల్ల ఉపయోగం ఉంటుంది. పోలవరంలో పూర్తి స్థాయిలో ఏపీని మొత్తంగా సస్యశ్యామలం చేయడం సాధ్యం. 2025 నాటికి పోలవరం ఫేజ్-1 పూర్తి చేస్తామంటున్నారు.

టీడీపీ ఉండుంటే 2020 జూన్ నాటికి పోలవరం పూర్తి చేశాం. పోలవరాన్ని జగన్ సర్వ నాశనం చేశారు. టీడీపీ హయాంలో రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు ఏపీలో ఎఫ్డీఐలు అథమ స్థానంలో ఉంది. 30 లక్షల ఉద్యోగాలొచ్చేవి. ఏపీని ఐటీ హబ్ చేయాలనుకుంటే ఇప్పుడు గంజాయికి హబ్ గా మార్చారు. టీడీపీ హయాంలో ఏపీలో ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం.

అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. సంక్షేమానికి టీడీపీ పుట్టినిల్లు. ఈ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయంలో ఎందుకు అథమ స్థానంలో ఉంది? విభజన చట్టంలో ఇస్తామన్న కేంద్ర విద్యా సంస్థలు ఎందుకు రావడం లేదు? విట్, ఎస్ఆర్ఎం, అమృత్ వంటి యూనివర్సిటీలు తెచ్చాం. విజయనగరంలో గిరిజన యూనివర్శిటీకి మేం భూమిస్తే.. ఈ ప్రభుత్వం ఆపేసింది. రోడ్ల వ్యవస్థను నాశనం చేశారు.
అమరావతి-అనంతపూర్ ఎక్స్ ప్రెస్ వేయాలని మేం భావిస్తే.. అమరావతి – ఇడుపులపాయకు ఆ రోడ్ మార్చారు. ప్రత్యేక హోదా గురించి ఈ సీఎం జగన్ ఎన్ని మాటలు మాట్లాడారు. వీళ్ల వ్యాపారాల కోసం వైసీపీకి సీట్లు ఇచ్చినట్టు అయింది. విభజన చట్టంలో చాలా సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. కానీ వీటిని అడిగే ప్రయత్నం చేయలేదు. కేసుల నుంచి బయటపడితే చాలు.. సీబీఐ అరెస్ట్ చేయకుంటే చాలంటూ సీఎం భావిస్తున్నారు” అని చంద్రబాబు అన్నారు.

Meera Kumar : రాజ్యాంగ పరిధిలోనే తెలంగాణ ఏర్పాటు : మీరా కుమార్