×
Ad

South Central Railway : రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఈ ట్రైన్ డెస్టినేషన్ మార్పు.. ఫుల్ డీటెయిల్స్

South Central Railway : రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ఫిబ్రవరి 3నుంచి చార్మినార్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

South Central Railway

  • చెన్నై బీచ్ నుంచి చార్మినార్ ఎక్స్‌ప్రెస్
  • ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 5వరకు ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానాల్లో మార్పులు
  • వివరాలు వెల్లడించిన సీపీఆర్వో శ్రీధర్

South Central Railway : రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ఫిబ్రవరి 3నుంచి చార్మినార్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ – తాంబరం మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ను ఇకపై రెండు నెలల పాటు చెన్నై బీచ్ స్టేషన్ వరకు మాత్రమే నడపనున్నట్లు తెలిపారు.

Also Read : Inter Students : ఇంటర్‌లో జాయిన్ అయ్యే వారికి గవర్నమెంట్ బంపర్ ఆఫర్.. జాయిన్ అయిన రోజే..

చెన్నై ఎగ్మోర్ స్టేషన్‌లో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు గమ్య స్థానాల్లో మార్పులు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.

హైదరాబాద్ వచ్చే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీరకు తాంబరం స్టేషన్లకు బదులు చెన్నై బీచ్‌కు బయల్దేరుతుందని, అలాగే ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు హైదరాబాద్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ చెన్నై బీచ్ వరకు నడుస్తుందని పేర్కొన్నారు.

మరోవైపు.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ – వైజాగ్ సెక్షన్ లో అత్యవసర భద్రతా, మరమ్మతులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు కీలక ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈనెల 31వ తేదీ ఈ మార్పులు అమల్లో ఉంటాయి. రత్నాచరల్, జన్మభూమి, సింహాద్రి వంటి ప్రధాన రైళ్లు రద్దు అయ్యాయి.