Chikoti Praveen: బోనాల వేళ.. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం వద్ద కలకలం రేపిన చీకోటి ప్రవీణ్ అనుచరులు

దీంతో ఆలయ సిబ్బంది వారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Lal Darwaja Bonalu

Chikoti Praveen – Bonalu: హైదరాబాద్‌లోని లాల్ దర్వాజా (Lal Darwaja Bonalu) సింహవాహినీ అమ్మవారి బోనాల సందర్భంగా దర్శించుకోవడానికి అక్కడకు వచ్చిన క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించి కలకలం రేపారు. ఆలయం లోపలికి ప్రవీణ్ అనుచరులు గన్ తో వెళ్లారు.

దీంతో ఆలయ సిబ్బంది వారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు చీకోటి ప్రవీణ్ అనుచరులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. వారివద్ద ఉన్న గన్ కు అనుమతి ఉందా? లేదా? అన్న విషయం కూడా ఆరా తీశారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులు గన్ తో పాటు ముగ్గురిని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. గన్ లైసెన్స్ కు సంబంధించిన డాక్యుమెంట్ ను ఛత్రినాక పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, లాల్ దర్వాజా సింహవాహినీ అమ్మవారి బోనాల సందర్భంగా అక్కడకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు.

చీకోటి ప్రవీణ్ ఏమన్నాడు?
వివాదంపై చీకోటి ప్రవీణ్ స్పందించాడు. ఆలయం లోపలికి గన్స్ తో వెళ్లలేదని చెప్పుకొచ్చాడు. తనకు ముప్పు ఉంది కాబట్టే గేట్స్ వరకు తీసుకువెళ్లానని తెలిపాడు. అన్ని అనుమతిలతో గన్ తీసుకున్నానని చెప్పాడు. సెక్యురిటీని కూడా ఏర్పాటు చేసుకున్నానని అన్నాడు. తాను, తమ సెక్యూరిటీ అత్యుత్సాహం ప్రదర్శించలేదని తెలిపాడు. గన్ కి సంబంధించిన డాక్యుమెంట్లను చెక్ చేసుకోండని చీకోటి ప్రవీణ్ చెప్పాడు.

టాస్క్ ఫోర్స్ పోలీసులే అత్యుత్సాహం ప్రదర్శించాడని చెప్పుకొచ్చాడు. తాను హిందూ ధర్మం కోసం పోరాడుతుంటే.. కొందరు తట్టుకోలేకపోతున్నారని అన్నాడు. మరి కొన్ని రోజుల్లో రాజకీయాల్లోకి వస్తానని, అందుకే తనపై కొందరు కక్ష కట్టారని తెలిపాడు.

Hyderabad : కస్టమర్లకు చుక్కలు చూపించిన ఏటీఎం.. రూ.8000 బదులు రూ.600

ట్రెండింగ్ వార్తలు