×
Ad

Hyderabad Manhole : హైదరాబాద్‌లో విషాదం.. పాల ప్యాకెట్‌కోసం వెళ్లిన చిన్నారి.. మ్యాన్‌హోల్‍‌లో పడి మృతి

సికింద్రాబాద్ పరిధిలోని కళాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. ఉదయాన్నే పాల ప్యాకెట్ కోసమని వెళ్లిని చిన్నారి మ్యాన్‌హోల్‌లో పడి మరణించింది.

manhole

Hyderabad Manhole : హైదరాబాద్ నగరం సికింద్రాబాద్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మౌనిక మ్యాన్‌హోల్‌లో పడి మరణించింది. సికింద్రాబాద్ పరిధిలోని కళాసిగూడలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానిక స్కూల్‌లో మౌనిక నాలుగో తరగతి చదువుతుంది. ఉదయాన్నే పాలప్యాకెట్ కోసం బయటకు వచ్చిన మౌనిక అదృశ్యమైంది. భారీ వర్షం కారణంగా రోడ్లు జలమయం కావడంతో మ్యాన్ హోల్‌ను గమనించకుండా అందులో పడిపోయింది.

Telangana Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం .. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

మౌనిక అదృశ్యం కావడంతో వెతుకులాట ప్రారంభించారు. అయితే, పార్క్‌లైన్ వద్ద మౌనిక మృతదేహాన్ని డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. పాల ప్యాకెట్‌కోసం బయటకు వచ్చిన చిన్నారి విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. చిన్నారి మృతికి కారణం జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్ హోల్ తెరిచి ఉండటం వల్లనే ఈ దారుణం చోటుచేసుకుందని స్థానికుల ప్రజలు పేర్కొంటున్నారు.

Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళనకు మద్దతు.. ఉదయాన్నే జంతర్ మంతర్‌కు ప్రియాంక గాంధీ..

మ్యాన్ హోల్ లో పడి చిన్నారి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఘటన స్థలికి చేరుకొని అధికారులు, స్థానికులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఉదయం 5గంటలకు ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారని తెలిపారు. భారీ వర్షం రావడంతో తన తమ్ముడితో వెళ్తున్న చిన్నారి.. తన తమ్ముడిని నీటిలో పడిపోకుండా కాపాడబోయి పాప మ్యాన్ హోల్‌లో పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారని మేయర్ అన్నారు. జీహెచ్ఎంసీ వాళ్లు బారికేడ్లు పెట్టారని, కానీ, షాపుల యాజమానులు తీసేశారని తెలిసిందని అన్నారు.