‘ఆమె నా పిల్ల రా’ అంటూ అమ్మాయి కోసం బాలుర మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

Tadoor: ఆ అమ్మాయిని మరో అబ్బాయి ప్రేమిస్తున్నాడని, ఆమెతో ఇక మాట్లాడవద్దని..

‘ఆమె నా పిల్ల రా’ అంటూ అమ్మాయి కోసం బాలుర మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

తెలంగాణలోని తాడూరు మండలం అల్లాపూర్‌లో ఓ అమ్మాయి కోసం కొందరు మైనర్లు ఘర్షణకు దిగారు. డానీశ్ అనే ఇంటర్ విద్యార్థి ఓ అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని, మరి కొంత మంది మైనర్ బాలురు అతడిని కొన్ని రోజులు బెదిరించారు.

ఆ అమ్మాయిని మరో అబ్బాయి ప్రేమిస్తున్నాడని, ఆమెతో ఇక మాట్లాడవద్దని డానిశ్‌ను బెదిరించారు. డానిశ్ వినకపోవడంతో అతడిని ట్రాప్ చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బోరబండ రైల్వే స్టేషన్ పట్టాల వద్ద రైల్వేట్రాక్‌పై పడేశారు. బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని చిత్రీకరించే ప్రయత్నంచ చేశారు.

పోలీసుల విచారణలో బయటపడింది ఈ హత్య ఉదంతం. 10 మంది బాలురను అల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని కూకట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇందులో ఐదుగురు మైనర్లు, మరో ఐదుగురు మేజర్లుగా గుర్తించారు. డానీశ్‌ను హత్య చేసింది దిగవంత రౌడీ షీటర్ కుమారుడు, ఆ బాలుడి గ్యాంగ్ అని పోలీసులు తెలిపారు.

రౌడీ షీటర్ కుమారుడికి బంధుత్వం ఉన్న యువతితో డానిశ్ చనువుగా ఉన్నాడని తేల్చారు. ఆ యువతితో డానిశ్ చనువుగా ఉండడాన్ని రౌడీ షీటర్ కుమారుడు జీర్ణించుకోకలేకపోయాడు. ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని రౌడీ షీటర్ కుమారుడు భావించాడని తేలింది.

Also Read: 18 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కాతమ్ముళ్లు.. విరిగిన పన్ను వల్ల ఎలా కలిశారో తెలుసా?