18 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కాతమ్ముళ్లు.. విరిగిన పన్ను వల్ల ఎలా కలిశారో తెలుసా?

UP Siblings: ముఖాన్ని సరిగ్గా గుర్తుపట్టలేకపోయింది. అతడిని నిశితంగా చూడడంతో అతడి విరిగిన పన్ను..

18 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కాతమ్ముళ్లు.. విరిగిన పన్ను వల్ల ఎలా కలిశారో తెలుసా?

Viral News: పన్ను విరిగిపోతే ఎంతో బాధపడిపోతాం. ఇక ముందరి పళ్లు విరిగిపోయాయంటే అందరూ ఎగతాళి చేస్తారని, నవ్వుకుంటారని సిగ్గుపడుతుంటాం. అయితే, ఇటువంటి పన్నే ఓ యువకుడికి వరమైంది. ఆ విరిగిన పన్ను వల్లే 18 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులను కలిశాడు ఆ యువకుడు.

యూపీలోని కాన్పూర్‌, హథీపూర్ గ్రామానికి చెందిన రాజ కుమారి అనే మహిళకు బాల గోవింద్ అనే అక్క ఉంది. వారిద్దరు 18 ఏళ్ల క్రితం విడిపోయారు. ఎలాగంటే.. బాల్యంలో పని కోసం బాల గోవింద్ ముంబై వెళ్లాడు. అనంతరం కొన్ని నెలల పాటు కుటుంబ సభ్యులతో ఫోనులో మాట్లాడాడు. ఆ తర్వాత ఫోను చేయడం మానేశాడు.

బాల గోవింద్ ముంబైలోనే ఉండిపోయాడు. చిన్నతనంలోనే ఓ రోజు సొంత గ్రామానికి రైలులో బయలుదేరాడు బాల గోవింద్. అయితే, అందులో అనారోగ్యంతో బాధపడుతూ సొంత ప్రాంతంలో దిగకుండా, తికమకపడి రాజస్థాన్‌లోని జైపూర్‌లో రైలు దిగాడు. రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి బాల గోవింద్‌ను తన ప్రాంతానికి తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పించాడు.

ఆ ఉద్యోగం చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. అలాగే, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ పోస్ట్ చేస్తుండేవాడు. ఇటీవల అతడి అక్క అతడి ఇన్‌స్టా రీల్ చూసింది. 18 ఏళ్ల తర్వాత చూడడంతో ముఖాన్ని సరిగ్గా గుర్తుపట్టలేకపోయింది. అతడిని నిశితంగా చూడడంతో అతడి విరిగిన పన్ను కనపడింది. అటువంటి పన్ను తన తమ్ముడికే ఉంటుందని ఆమెకు అనుమానం వచ్చింది.

Also Read: అమర్‌నాథ్ యాత్ర.. 52 రోజులు పాటు హరహర మహాదేవ స్మరణతో మార్మోగనున్న హిమగిరులు

అతడు తన సోదరుడేనని నిర్ధారణకు వచ్చి సోషల్ మీడియాలో అతడితో చాటింగ్ చేసింది. అతడు అంత పెద్దవాడు అయినప్పటికీ అతడి విరిగిన పన్నులో మార్పు లేకపోవడం గమనార్హం. ఇలా అక్కాతమ్ముళ్లు చాటింగ్ చేసుకుని మళ్లీ దగ్గరయ్యారు. తాజాగా, బాల గోవింద్ తన స్వగ్రామానికి వచ్చాడు. అతడు కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.