CM Jagan
CM Jagan Will met KCR: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ రానున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించనున్నారు. కేసీఆర్ కాలుజారి కింద పడటంతో గత నెల 8న సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎముక విరిగినట్లు గుర్తించి, శస్త్రచికిత్స నిర్వహించారు. కొద్దికాలం కేసీఆర్ యశోద ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ నేతలు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
Also Read : KCR Discharge : యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
గతనెల 15న చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. బంజారాహిల్స్ నందినగర్ లోని ఆయన పూర్వ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. కాగా, రేపు నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లి కేసీఆర్ ను జగన్ పరామర్శిస్తారు.