పిచ్చి పనులు బంద్ చేసుకోవాలె..తొక్కిపడేస్తాం – కేసీఆర్ ఫైర్

publc meeting kcr

CM KCR Angry : ‘సహనానికి ఓ హద్దు ఉంటుంది..పిచ్చి వాగుడు కూడా హద్దు ఉంటుంది..హద్దు మీరిన నాడు..ఏం చేయాలో మాకు కూడా తెలుసు. చాలా మంది రాకాసులతో కొట్లాడినం.. గోకాసులు గోచి కింద..లెక్క కాదు..తొక్కిపడేస్తాం..జాగ్రత్త..పిచ్చి పనులు బంద్ చేసుకోవాలె. లేకుంటే..దారుణంగా నష్టపోతరు’ అంటూ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ బుధవారం సాగర్ నియోజకవర్గంలో పర్యటించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కొంతమంది అల్లరి చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో నల్గొండ జిల్లాను ఏ నాయకుడు పట్టించుకోలేదు..కాంగ్రెస్, బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు…మీలాగా మాట్లాడడం మాకు తెలుసన్నారు. ఏమైనా సమస్యలుంటే..చెప్పండి..పిచ్చి మాటలు మాట్లాడకండి అంటూ సూచించారాయన. ఇప్పటికైనా మీ పిచ్చిపనులు బంద్ చేసుకోండి…దుమ్ము దుమ్మైపోతరు..వేరే సభ దగ్గరకు వచ్చి వీరంగం చేస్తాం..మంచి సంస్కారం కాదని హితవు పలికారు. ప్రజలే తగిన బుద్ధి చెబుతరు..ఇంకా ముల్లు ఎక్కువగా ఉందంటే…ముల్లును కూడా పొల్లు పొల్లు చేసి తీరుతాం..జాగ్రత్తా..చేతులు ముడుచుకుని కూర్చొరు..పిచ్చిపనులు బంద్ చేసుకుంటే..మంచిదని మరోసారి సూచించారు సీఎం కేసీఆర్.

బీజేపీ నేతలు కొత్త బిచ్చగాడిలా మాట్లాడుతున్నారు..వీరికి ప్రజలే బుద్ధి చెబుతారు..పార్టీలు, నాయకత్వాలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి…హద్దు మీరితే..ఏం చేయాలో మాకు తెలుసన్నారు. మేం చాలా మందితో కొట్లాడం..వీళ్లు మాకో లెక్క కాదు..కావాలంటే సభలు పెట్టుకుని ప్రజా తీర్పు కోసం వెళ్లాలన్నారు. తెలంగాణను కరువుపాలు చేసింది ఎవరో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసిన పాపం కాంగ్రెస్ దేనని విమర్శించారు. పదవులు, స్వార్థం కోసం తెలంగాణను బలిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.