CM KCR : నేడు మరోసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సీఎం కేసీఆర్.. ఒకే రోజు మూడు సభల్లో పాల్గొననున్న గులాబీ బాస్

హ్యాట్రిక్ రేసులో ఉన్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తిరుమలగిరిలో తుంగతుర్తి సమర శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న కిషోర్ ఈ సభ ద్వారా మరింత నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారని ధీమాగా ఉన్నారు.

CM KCR Nalgonda Tour

CM KCR Nalgonda Tour : సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 12 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అక్టోబర్ 26న మునుగోడులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేసీఆర్ ఇవాళ మరో మూడు నియోజకవర్గాల్లో పర్యటనకు రెడీ అయ్యారు. కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ మొదటగా కోదాడలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరవుతారు.

ఇటీవల పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు భారీ ఎత్తున పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడంతో కోదాడ గులాబీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే కొంతమంది అసంతృప్తులను బుజ్జగించిన పార్టీ పెద్దలు పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగారు. కేసీఆర్ సభతో ఆ పరిస్థితి మరింత మెరుగవుతుందని కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఆశాభావంతో ఉన్నారు.

Kavitha Kalvakuntla : చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన ఎమ్మెల్సీ కవిత, ఆమె ఏమన్నారంటే..

హ్యాట్రిక్ రేసులో ఉన్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తిరుమలగిరిలో తుంగతుర్తి సమర శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న కిషోర్ ఈ సభ ద్వారా మరింత నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారని ధీమాగా ఉన్నారు. సీఎం కేసీఆర్ సభతో క్యాడర్ ను ఎన్నికల మూడ్ లోకి మరింత ముంచేయాలని చూస్తున్నారు.

తుంగతుర్తి సభ తర్వాత సాయంత్రం ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగడి సునీతకు మద్దతుగా సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. నియోజకర్గ పరిధిలో యాదాద్రి అభివృద్ధితోపాటు పలు అంశాలు తమకు పాజిటివ్ గా ఉన్నాయని, ఈసారి హ్యాట్రిక్ విజయం పక్కా అని ధీమాగా ఉన్నారు. ఆలేరు నుంచి నేరుగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకుంటారు.

Revanth Reddy : కేసీఆర్ తన ఓటమిని ముందే ఒప్పుకున్నారు, అధికారంలోకి వచ్చాక లక్ష కోట్లు కక్కిస్తాం- రేవంత్ రెడ్డి

పోలింగ్ తేదీకి దాదాపు మరో నెల రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఈ సభల అనంతరం ప్రచారం ఉధృతిని పెంచాలని జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రణాళికలు రచిస్తున్నారు. సీఎం కేసీఆర్ సభ జోష్ తో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు మ్యానిపెస్టోను కింది స్థాయి వరకు తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.