Revanth Reddy : కేసీఆర్ తన ఓటమిని ముందే ఒప్పుకున్నారు, అధికారంలోకి వచ్చాక లక్ష కోట్లు కక్కిస్తాం- రేవంత్ రెడ్డి

అభివృద్ధికి కాంగ్రెస్ పునాదులు వేస్తే.. కేసీఆర్ వచ్చి దోచుకున్నారు తప్ప చేసిందేమీ లేదు. మీరు భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగినట్టా? Revanth Reddy

Revanth Reddy : కేసీఆర్ తన ఓటమిని ముందే ఒప్పుకున్నారు, అధికారంలోకి వచ్చాక లక్ష కోట్లు కక్కిస్తాం- రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams CM KCR

Revanth Reddy Slams CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణను దోచుకున్నారని కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ గెలుస్తుందని కేసీఆర్ కు ముందే తెలిసిపోయిందని, అందుకే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటామని చెబుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ”కేసీఆర్ తన ఓటమిని అచ్చంపేటలో ముందే ఒప్పుకున్నారు. మీరు ఓడితే మీదేమీ పోదనుకోవద్దు. మీరు మింగిన లక్ష కోట్లు కక్కిస్తాం. 10 వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటాం. మీరు భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగినట్టా?

అభివృద్ధికి కాంగ్రెస్ పునాదులు వేస్తే.. కేసీఆర్ వచ్చి దోచుకున్నారు తప్ప చేసిందేమీ లేదు. వైఎస్ హయాంలో తాండూరుకు నీళ్లు ఇవ్వాలని ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుకున్నాం. మీరు భుజాలపై మోసి గెలిపిస్తే పైలట్ రోహిత్ రెడ్డి వందల కోట్లకు అమ్ముడుపోయాడు. భూకబ్జాలు, ఇసుక దోపిడీ దొంగను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా నిలిపింది.

Also Read : కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. ఇటీవలే పార్టీలో చేరి టికెట్లు దక్కించుకున్న వారు వీరే

ఎప్పుడూ ఒకరిపై ఒకరు కాలు దువ్వుకునే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే.. ఇవాళ ఒకరి కాళ్లు ఒకరు మొక్కుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. డీకే శివకుమార్ లక్ష 20వేల మెజారిటీతో గెలిచారు. కొడంగల్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి” అని తాండూరులో కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also Read : మళ్లీ కేసీఆర్ రాకుంటే.. అమరావతిలా హైదరాబాద్- మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు