Cm Kcr To Take Up Surprise Visits
CM KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలు చేయడానికి రెడీ అయిపోయారు. తనిఖీల్లో అధికారుల పనితీరును పరిశీలిస్తానని, అభివృద్ధి ఎలా ఉందో చూస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈనెల 19వ తేదీ తర్వాతే..తనిఖీలు ఉంటాయన్నారు. అందులో భాగంగా.. ఈనెల 20వ తేదీన సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో అకస్మిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు.
అనంతరం ఈనెల 21వ తేదీన వరంగల్ జిల్లాలకు వెళ్లి అక్కడ తనిఖీలు చేయనున్నారు. అదే రోజున వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నెల 13వ తేదీ సోమవారం అదనపు కలెక్టర్లు, డీపీవోలతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో పట్టణ ప్రగతి అమలుపై సీఎం కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత..పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
Read More : BJP Core Committee : టీడీపీ తో కలిసే ప్రసక్తే లేదు : బీజేపీ నేత మాధవ్