CM KCR
CM KCR: సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబాబాద్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభిస్తారు. ఉదయం మానుకోటలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్.. మధ్యాహ్నం కొత్తగూడెంకు చేరుకొని అక్కడ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా రెండు జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలను సీఎం ప్రారంభిస్తారు.
ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట లభించేలా రాష్ట్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే 14 జిల్లాల్లో ఈ భవనాలను ప్రారంభమయ్యాయి. నేడు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు అధికారగణంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టరేట్ ఆవరణలో తలపెట్టిన సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. అదేవిధంగా కొత్తగూడెంలోనూ సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడతారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా స్వాగత తోరణాలతో ఆయా ప్రాంతాలు గులాబీమయంగా మారాయి.
GVL fires On CM KCR : కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ఏపీ వెళతారు? : బీజేపీ ఎంపీ
కేసీఆర్ పర్యటన ఇలా..
– ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ మానుకోటకు చేరుకుంటారు.
– ఉదయం 10.00 గంటలకు బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభిస్తారు.
– 11.00 గంటలకు మహబూబాబాద్ కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు.
– 11.30 గంటలకు కలెక్టరేట్ ఆవరణలో జరిగే ప్రజాప్రతినిధుల సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు.
– మధ్యాహ్నం 1గంటకు కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా అభివృద్ధిపై సమీక్షిస్తారు.
– 1.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం చేరుకుంటారు.
– 1.55 గంటలకు కొత్తగూడెం సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.
-2.50 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
– మధ్యాహ్నం 3.20గంటలకు బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
– 4.30 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు బయలుదేరుతారు.