GVL fires On CM KCR : కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ఏపీ వెళతారు? : బీజేపీ ఎంపీ

సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. ఏపీ ప్రజలను తిట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీలో రాజకీయాలు చేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఏపీ ఆహారాలను చులకన చేసి మాట్లాడారు? ఆంధ్రా పార్టీలు, పాలకులు అవసరమా? ఏపీ ప్రజలు, నాయకులు తెలంగాణను దోచుకున్నారంటూ చేసిన ఆరోపణలు మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు.

GVL fires On CM KCR : కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ఏపీ వెళతారు? : బీజేపీ ఎంపీ

GVL fires On CM KCR

GVL fires On CM KCR : సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. ఏపీ ప్రజలను తిట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీలో రాజకీయాలు చేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఏపీ ఆహారాలను చులకన చేసి మాట్లాడారు? ఆంధ్రా పార్టీలు, పాలకులు అవసరమా? ఏపీ ప్రజలు, నాయకులు తెలంగాణను దోచుకున్నారంటూ చేసిన ఆరోపణలు మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఆంధ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టాలని.. తెలిపారు.ఆంధ్రా పార్టీలు, నాయకత్వం వద్దన్న కేసీఆర్ కు ఇక్కడ పనేంటని నిలదీశారు. ఉమ్మడి ఏపీలో ఆంధ్రాపాలకులు వద్దన్న కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ పాలకులు వచ్చి ఏపీలో రాజకీయాలు చేస్తామంటే ఏపీ ప్రజలు ఊరుకుంటారా? ఏపీ ప్రజలంటే కేసీఆర్ కు అంత చులకనా? అంటూ మండిపడ్డారు జీవీఎల్.

ఆంధ్రాకు కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ప్రజలు మర్చిపోరన్నారు. కేసీఆర్ చర్యల వలన ఏపీకి తీవ్ర నష్టం జరుగిందని ఇప్పటికీ జరుగుతోందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్రా ప్రజల్ని నోటికొచ్చినట్లుగా తిట్టారని ఇప్పుడు అవన్నీ ఏపీ ప్రజలు మర్చిపోతారా? కేసీఆర్ ను ఏపీలోతిరగనిస్తారా? ఆంధ్రోళ్లను తరిమికొట్టండీ అంటూ పిలుపునిచ్చిన కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ఏపీలో తిరుగుతారు? అక్కడే ఎలా రాజకీయాలు చేస్తారు? అంటూ మండిపడ్డారు. అత్యంత దారుణంగా ఆంధ్రా ప్రజల్ని తిట్టిన కేసీఆర్ బహిరంగంగా ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏపీ నాయకులు, ప్రజలు ఎందుకు? అని అన్న కేసీఆర్ ఇప్పుడు ఏపీ ప్రజలకు కూడా అదే ఫీలింగ్ ఉందని అలనాడు మీరు చేసిన అవమానాలను ఏపీ ప్రజలు మర్చిపోయరని అన్నారు.

ఆంధ్రాకు కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ప్రజలు మర్చిపోరని..తాము ఏపీలో అధికారంలోకి వస్తే పోలవరం కడతామనడం సిగ్గుచేటని..పోలవరంపై కేసీఆర్ కోర్టులో కేసులు వేశారని ఇప్పుడు ఆయనే పోలీవరం కట్టేస్తానంటూ అధికారం కోసం కల్లబొల్లి మాటలు చెబితే విని నమ్మటానికి ఏపీ ప్రజలు అమాకులు కాదనే విషయం కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను సముద్రం పాలు చేశారని మండిపడ్డారు జీవీఎల్. కేసీఆర్ తెలంగాణలో కూడా అధికారం కోల్పోవడం ఖాయమని..బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం అని అన్నారు. కాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన క్రమంలో కేసీఆర్ ఏపీలో కూడా పోటీ చేస్తామని ఏపీతో పాటు తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలిపిన విషయం తెలిసింది. దీంట్లో బాగంగానే ఏపీలో తొలిసారి అడుగు పెట్టనున్నారు.