CM KCR : ఐఏఎస్‌ సర్వీస్‌ రూల్స్‌ మార్చొద్దు.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

దొంగదారిలో సర్వీస్‌ రూల్స్ మార్చుతున్నారంటూ ఫైర్ అయ్యారు. దమ్ముంటే పార్లమెంట్‌ ద్వారా చట్ట సవరణ చేపట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

CM KCR : ఐఏఎస్‌ సర్వీస్‌ రూల్స్‌ మార్చొద్దు.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

Cm Kcr (1)

Updated On : January 25, 2022 / 7:06 AM IST

CM KCR’s letter to PM Modi : ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఐఏఎస్‌ సర్వీస్‌ రూల్స్ మార్చాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. సర్వీసు రూల్స్ మార్చడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు.

దొంగదారిలో సర్వీస్‌ రూల్స్ మార్చుతున్నారంటూ ఫైర్ అయ్యారు. దమ్ముంటే పార్లమెంట్‌ ద్వారా చట్ట సవరణ చేపట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. డిప్యుటేషన్‌పై అధికారం రాష్ట్రాలకే ఉండేలా ప్రస్తుత నిబంధనలు ఉన్నాయని తెలిపారు.

Buddha Venkanna Released : టీడీపీ నేత బుద్దా వెంకన్న స్టేషన్‌ బెయిల్‌పై విడుదల

కేంద్రం తీసుకొస్తున్న సవరణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయన్నారు. రాష్ట్రాలు, అధికారుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా రూల్స్‌ మార్చుతున్నారని ప్రధానికి రాసిన లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.