Buddha Venkanna Released : టీడీపీ నేత బుద్దా వెంకన్న స్టేషన్‌ బెయిల్‌పై విడుదల | TDP leader Buddha Venkanna released on station bail

Buddha Venkanna Released : టీడీపీ నేత బుద్దా వెంకన్న స్టేషన్‌ బెయిల్‌పై విడుదల

వివరణ అడిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు.

Buddha Venkanna Released : టీడీపీ నేత బుద్దా వెంకన్న స్టేషన్‌ బెయిల్‌పై విడుదల

Buddha Venkanna released on station bail : టీడీపీ నేత బుద్దా వెంకన్న విడుదలయ్యారు. స్టేషన్‌ బెయిల్‌పై ఆయనను విడుదల చేశారు పోలీసులు. ఆరు గంటలపాటు ప్రశ్నించారు. అన్ని విషయాలు ఇవాళ మాట్లాడతానన్నారు బుద్దా వెంకన్న. జరిగిన ఘటనపై విచారణ జరిపారన్న ఆయన.. స్టేషన్‌ బెయిల్‌ పై తనను పంపించినట్లు చెప్పారు. మంత్రి కొడాలి నాని తాజాగా మాట్లాడిన దానిపైనా సమాధానం చెబుతానన్నారు.

అంతకుముందు బుద్దా వెంకన్నను అరెస్ట్ చేసిన పోలీసులు… విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం వైఎస్.జగన్‌, మంత్రి కొడాలి నాని, డీజీపీపై వ్యతిరేకంగా బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు.

Prashant Kishor : 2024లో బీజేపీని ఓడించడం సాధ్యమే – పీకే

వివరణ అడిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. బుద్దా వెంకన్న అరెస్ట్ సందర్భంగా ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందన్నారాయన. ఏపీలో పోలీసులు ప్రజారక్షణ కోసమే పనిచేస్తున్నారా అని లోకేశ్‌ ప్రశ్నించారు. మరోవైపు విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌ క్యూ టీడీపీ శ్రేణులు క్యూ కట్టారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు.

×