Chandrababu : బుద్ధా వెంకన్న అరెస్ట్.. పోలీసులకు చంద్రబాబు వార్నింగ్

గుడివాడలో ఏమీ జరగకుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు మాట్లాడడం లేదని చంద్రబాబు నిలదీశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం హేయం అన్నారు.

Chandrababu : బుద్ధా వెంకన్న అరెస్ట్.. పోలీసులకు చంద్రబాబు వార్నింగ్

Chandrababu Naidu

Chandrababu : టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్ పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. బుద్ధా అరెస్ట్ ను చంద్రబాబు ఖండించారు. బుద్ధా అరెస్ట్ కుట్రపూరితం అన్నారు. తమ నేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొడాలి నాని కేసినోపై ప్రశ్నించిన తమ నేతలను అరెస్ట్ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

గుడివాడలో ఏమీ జరగకుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు మాట్లాడడం లేదని చంద్రబాబు నిలదీశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం హేయం అన్నారు. పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందన్న చంద్రబాబు, తప్పు చేసిన పోలీసులు విచారణ ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు.

COVID : కరోనాపై సైంటిస్టుల తీపి కబురు

ఈ వ్యవహారంపై నారా లోకేష్ కూడా స్పందించారు. ఏపీలో పోలీసులు ప్రజా రక్షణ కోసమే పని చేస్తున్నారా? లేదంటే వైసీపీ నేతలకు కాపలా కాస్తున్నారా? అని ప్రశ్నించారు లోకేశ్‌. బుద్దా వెంకన్న అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. కొడాలి నాని క్యాసినో న‌డిపినప్పుడు, గ‌డ్డం గ్యాంగ్ ప్రతిప‌క్ష నేత‌ని బూతులు తిట్టినప్పుడు.. పోలీసులు ఎక్కడున్నారని లోకేశ్ ప్రశ్నించారు. ‘‘గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడు పోలీసులు లేరు. టీడీపీ కేంద్ర కార్యాల‌యాన్ని ధ్వంసం చేస్తే నో పోలీస్‌’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిని నిలదీస్తే.. పోలీసులు పరుగున వ‌చ్చి వెంకన్నను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు.

ఉద్రిక్త పరిస్థితుల నడుమ బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం బుద్ధా నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి వాహనంలోకి ఎక్కించారు. మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బుద్ధాపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ సందర్భంగా బుద్ధా వెంకన్న డీజీపీపై మండిపడ్డారు. డీజీపీ తీరు చూస్తుంటే జగన్ పార్టీకి డైరెక్టర్ లా ఉందని విమర్శించారు.

Watching TV : అధిక సమయం టీవీ చూసే అలవాటుందా?… అయితే జాగ్రత్త?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ కేసినో వివాదం దుమారం రేపుతోంది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. చూసుకుందాం రా.. తేల్చుకుందాం రా.. కొట్టుకుందాం రా.. అంటూ.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ ను మరింత పెంచారు. మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెషన్ లో కేసినో జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి తొలగించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.