Vastu Changes in Secretariat : తెలంగాణ సెక్రటేరియట్ లో వాస్తు మార్పులపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన సీఎ కాన్వాయ్ ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ (ఈశాన్య) గుండా బయటకు వెళ్లిపోయేలా మార్పులు చేస్తున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి వాస్తు మార్పులు చేయిస్తుండటం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు సెక్రటేరియట్ లోని సీఎం ఆఫీస్ ని 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తుకు మార్చాలని ఇప్పటికే నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం 9వ అంతస్తులో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇక సచివాలయం సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులతో పాటు విజిటర్స్ రాకపోకలు సాగిస్తున్నారు.
Also Read : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని అదృశ్యం