Cm Revanth Reddy : రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తాం- సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అభివృద్ది కోసం అవసరమైతే ప్రధాని మోదీతో కొట్లాడేందుకు కూడా సిద్ధమే.

Cm Revanth Reddy : తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అవసరమైతే మోదీతో కొట్లాడతామని, అసదుద్దీన్ ఓవైసీతో కలిసి పని చేస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్ ను కాపాడి, ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాకు దక్కింది. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంఐఎంతో కలిసి పని చేస్తాం. ఎన్నికల సమయంలో మాత్రమే రాజనీతి చూపిస్తాం. ఒక్కసారి ఎన్నికలు అయిపోయాక.. రాజకీయం చేయడం అంటూ ఉండదు. మా హక్కులు మేము కచ్చితంగా అడుగుతాం. మాకు రావాల్సిన లెక్కలు సాధించుకుంటాం.

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అభివృద్ది కోసం అవసరమైతే ప్రధాని మోదీతో కొట్లాడేందుకు కూడా సిద్ధమే. ఒవైసీతో కలవాల్సి వస్తే కలుస్తాను. హైదరాబాద్ ను అభివృద్ది చేసేందుకు నేను ప్రయత్నిస్తా. ఫ్లై ఓవర్ పేరు పీవీ నరసింహారావు. ఇది నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్తుంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరును ఫ్లైఓవర్ కు పెడతాం. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. దేశం కోసం ప్రధాని మన్మోహన్ సింగ్ ఎంతో శ్రమించారు. ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.

 

Also Read : కేటీఆర్ ఏసీబీ విచారణ రోజు హైడ్రామా.. విచారణకు సహకరించలేదంటూ అరెస్ట్ చేస్తారా?