Cm Revanth Reddy : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ..

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఐటీ ఇండస్ట్రీకి కేరాఫ్ గా మారింది తెలంగాణ రాష్ట్రం.

Cm Revanth Reddy : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ పై చర్చించారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. బంజారాహిల్స్ లోని సత్యనాదెళ్ల ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయన వెంట మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటుకు చొరవ చూపాలని విన్నపం..
తెలంగాణలో ఐటీ పరిశ్రమకు ప్రభుత్వం అనేక మౌలిక సదుపాయాలు కల్పించింది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటుకు కూడా చొరవ చూపాలని సత్య నాదెళ్లను సీఎం రేవంత్ కోరనున్నారు. ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ డేటా సెంటర్ తో పాటు ప్రతిష్టాత్మక కంపెనీలు వచ్చాయి. మైక్రోసాఫ్ట్ సైతం తన వంతుగా హైదరాబాద్ లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని సత్యనాదెళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరబోతున్నారని తెలుస్తోంది.

Also Read : పీవీకి కూడా ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేయాలని సభలో తీర్మానం చేయాలి : కేటీఆర్

32 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి…
తెలంగాణకు సంబంధించి 6 డేటా కేంద్రాలను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయబోతోంది. 32వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో డేటా సెంటర్లకు అవసరమైన స్థలాలను కూడా కేటాయించడం జరిగింది. ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీగా పేరొందిన మైక్రోసాఫ్ట్ కూడా.. హైదరాబాద్ లో తమ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది.

Cm Revanth Meets Microsoft CEO Satya Nadella

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ ఐటీ ఇండస్ట్రీకి కేరాఫ్ గా మారింది. ఐటీ రంగంలో కీలక భూమిక పోషిస్తోంది. సత్యనాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. భేటీ అనంతరం సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ ఏయే అంశాలపై చర్చించారు అనే అంశంపై మంత్రి శ్రీధర్ బాబు వివరాలు వెల్లడించబోతున్నారు. దేశంలో ఐటీ రంగానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత హైదరాబాద్ అనువైన ప్రాంతంగా ఉంది. మౌలిక వసతుల కల్పన విషయంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది.

Cm Revanth Meets Satya Nadella

ఐటీ సెక్టార్ కు కేరాఫ్ గా తెలంగాణ..
ఐటీ కంపెనీలు పెట్టుకోవడానికి ఇక్కడ అనువైన, సురక్షితమైన ప్రాంతాలు ఉన్నాయని, రాయితీలు కూడా కల్పిస్తామని.. కాబట్టి ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలంటూ సత్య నాదెళ్ల దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంతో పాటు ఫార్మా రంగంలోనూ తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడం వల్ల దానికి అనుబంధంగా ఉన్న కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టి విస్తరించే అవకాశం ఉంటుంది.

Also Read : రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్‌కు ఎక్కడో చెడింది: బండి సంజయ్‌