Bandi Sanjay: రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్‌కు ఎక్కడో చెడింది: బండి సంజయ్‌

రేవంత్‌ రెడ్డిని ఇవాళ పవన్ కల్యాణ్ ఏమన్నారో తనకు తెలియదని చెప్పారు.

Bandi Sanjay: రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్‌కు ఎక్కడో చెడింది: బండి సంజయ్‌

Bandi Sanjay

Updated On : December 30, 2024 / 4:23 PM IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, సినీ హీరో అల్లు అర్జున్‌కు ఎక్కడో చెడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రేవంత్‌ రెడ్డిని ఇవాళ పవన్ కల్యాణ్ ఏమన్నారో తనకు తెలియదని చెప్పారు. అసెంబ్లీలో గంటల తరబడి చర్చించాల్సిన అంశమే కాదని అన్నారు.

కాంగ్రెస్ కేరాఫ్ కమీషన్ల సర్కార్ అంటూ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… 14 శాతం కమీషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులు మంజూరవుతున్నాయని అన్నారు. ఈ విషయంలో మంత్రుల మధ్యే వార్ మొదలైందని తెలిపారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని చెప్పారు.

మాజీ సర్పంచులకు బిల్లులివ్వకుండా నిండా ముంచిందని తెలిపారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులన్నీ మాజీ సర్పంచులు చేసినవేనని అన్నారు. అయినా వాళ్లకు బిల్లులివ్వకుండా అప్పుల పాల్జేయడం దుర్మార్గమని తెలిపారు.

రాబోయే స్థానిక ఎన్నికల్లో తాజా మాజీలు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. వారి అండగా బీజేపీ ఉందని, వారి పక్షాన అతి త్వరలో ఉద్యమిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ మెడలు వంచి బిల్లులు చెల్లించేలా చేస్తామని అన్నారు. చేతగాని కాంగ్రెస్ సర్కార్ వల్లే రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగిందని విమర్శించారు.

అందుకే నాగబాబుకు క్యాబినెట్‌లో అవకాశం దక్కింది: పవన్ కల్యాణ్