Pawan Kalyan: అందుకే నాగబాబుకు క్యాబినెట్‌లో అవకాశం దక్కింది: పవన్ కల్యాణ్
సినిమాల్లోనూ నటిస్తున్న నాగబాబు.. అధిక సమయం జనసేన పార్టీ కోసమే కేటాయిస్తున్నారు.

జనసేన నేత నాగబాబుకు తన సోదరుడిగా క్యాబినెట్‌లో అవకాశం ఇవ్వలేదని, తనతో సమానంగా పనిచేశారని కాబట్టి ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తన సోదరుడు కాకపోయినా సరే, కాపు సామాజికవర్గం కాకపోయినా సరే.. ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చేవాడినని చెప్పారు.
అలాగే, మంత్రి పదవిలో ఉన్న కందుల దుర్గేశ్‌ది ఏ కులమో తనకు తెలియదని పవన్ కల్యాణ్ తెలిపారు. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత.. తనతో కలిసి పనిచేసి ఉంటే వాళ్లకే అవకాశం ఇచ్చేవాడినని చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం కలిసి పనిచేసే వాళ్లను వారసత్వంగా చూడలేమని పవన్ కల్యాణ్ చెప్పారు. మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారని, ఎమ్మెల్సీ అయ్యాకే క్యాబినెట్‌లోకి వస్తారని తెలిపారు.
కాగా, సినిమాల్లోనూ నటిస్తున్న నాగబాబు.. అధిక సమయం జనసేన పార్టీ కోసమే కేటాయిస్తున్నారు. ప్రత్యర్థులకు తనదైన స్టైల్‌లో కౌంటర్స్ ఇస్తున్నారు. నిత్యం జనసేన కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవన్ నిర్వహించే సభలకు ఏర్పాట్లను పరిశీలిస్తూ, నాయకులను సమన్వయం చేస్తూ వస్తున్నారు. జనసేనలో మొదటి నుంచీ ఆయన నమ్మకమైన నేతగా ఉన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే పూజారులకు నెలకు రూ.18 వేల చొప్పున ఇస్తాం: కేజ్రీవాల్ హామీ