CM Revanth Reddy : అమెరికాలో డ్రైవర్‌లెస్ కారులో ప్రయాణించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ దక్షిణ కొరియాలో పర్యటన

యూఎస్ లో ఎనిమిది రోజులు పాటు పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం దాదాపు 50 వాణిజ్య సంస్థలతో సంప్రదింపులు జరిపారు.

driverless car waymo

CM Revanth Reddy South Korea Tour : పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన కొనసాగుతుంది. యూఎస్ లో పర్యటన ముగించుకొని తాజాగా రేవంత్ రెడ్డి బృందం దక్షిణ కొరియాలోకి అడుగుపెట్టింది. ఆ దేశంలోని సియోన్ నగరానికి చేరుకుంది. దక్షిణ కొరియాలో పెట్టుబడల వేట కొనసాగనున్నాయి. ఈ క్రమంలో ఇవాళ యూయూ ఫార్మా ప్రతినిధులతో సీఎం బృందం భేటీ కానుంది. కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్ టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. నెక్ట్స్, హ్యూందయ్ మోటార్ కంపెనీల ప్రతినిధులతోనూ భేటీ కానున్నారు. హ్యాన్ రివర్ ప్రాజెక్ట్ డిప్యూటీ మేయర్ తోనూ, సాంసంగ్ అధ్యక్షుడు కిమ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈవోతోనూ రేవంత్ బృందం భేటీ కానుంది. రేపు సాయంత్రం దక్షిణ కొరియా నుంచి సింగపూర్ వెళ్లనుంది. ఎల్లుండి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.

Also Read : రోజుకో మలుపు తిరుగుతున్న దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం.. తాజాగా మరో ట్విస్ట్

అమెరికా పర్యటనలో ఆదివారం శాన్‌ఫ్రాన్సిస్కోలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించింది. గూగుల్ కంపెనీకి చెందిన వేమో డ్రైవర్ లెైస్ కారులో రేవంత్ రెడ్డి ప్రయాణించారు. డ్రైవర్ లేకుండానే ఆ కారు నడుస్తుండటాన్ని ఆయన నిశితంగా పరిశీలించారు. వేమో కారులో సీఎం రేవంత్ రెడ్డితోపాటు, మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రయాణించారు. దానిలో జర్నీ ఎలా ఉందనే విషయాన్ని ప్రత్యక్ష్యంగా తెలుసుకున్నారు.

Also Read : Paris Olympics 2024 : ముగిసిన పారిస్ ఒలింపిక్స్ .. అమెరికాదే అగ్రస్థానం.. అదిరిపోయిన ముగింపు సంబరాలు

యూఎస్ లో ఎనిమిది రోజులు పాటు పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం దాదాపు 50 వాణిజ్య సంస్థలతో సంప్రదింపులు జరిపారు. న్యూయార్క్, న్యూజెర్సీ కాలిఫోర్నియా, డల్లాస్, టెక్సాస్, వాషింగ్టన్ రాష్ట్రాల్లోని కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణ బ్రాండ్ ను వివరిస్తూ తమ ప్రభుత్వ ఫ్యూచర్ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అమెరికాలో దాదాపు 31,531కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. గూగుల్, అమెజాన్ సహా పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో సుమారు 30,750 కొత్త ఉద్యోగాలు అందుబాటులో రానున్నాయి.

Also Read : సబిత Vs సీఎం రేవంత్‌.. అసలు ఎవరు ఎవరిని మోసం చేశారు, ఇద్దరికీ ఎక్కడ చెడింది? మాజీ మంత్రి సబితతో వీకెండ్ ఇంటర్వ్యూ

ట్రెండింగ్ వార్తలు