రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు అన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశారని కేంద్ర ప్రభుత్వం తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Revanth Reddy : రిజర్వేషన్లు రద్దుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నారని, ఆర్ఎస్ఎస్ ఆలోచనను దేశంపై రుద్దాలనే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్డీయే పదేళ్ల పాలనపై గాంధీ భవన్ లో నిర్వహించిన ఛార్జ్ షీట్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమేనని అన్నారు. వంద సంవత్సరాల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆర్ఎస్ఎస్ కంకణం కట్టుకుందని, తమకు మెజార్టీ వస్తే రిజర్వేషన్లు తీసేయడం సులభం అని మోదీ అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ దేశాన్ని మోసం చేశాడు. డబుల్ ఇంజిన్ అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు.. అదానీ, ప్రధాని అంటూ రేవంత్ విమర్శించారు.

Also Read : కేరళలో ఆసక్తికరంగా ట్రయాంగిల్ ఫైట్.. కంచుకోటను నిలబెట్టుకునేందుకు కామ్రేడ్ల స్కెచ్

పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని సీఎం రేవంత్ విమర్శించారు. 20కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. నల్లధనం తెస్తానన్న మోదీ పది పైసలు కూడా తేలేదు. రూ.55 పెట్రోల్ ధర మోదీ వచ్చిన తరువాత రూ.110కి చేరింది. జీఎస్టీ పేరుతో దోపిడీ చేశారంటూ మోదీ ప్రభుత్వంపై రేవంత్ విమర్శలు చేశారు. దేవుడి పేరు చెప్పే బీజేపీ అగరబత్తీలపై కూడా జీఎస్టీ వేశారు. చిన్న పిల్లల పెన్సిల్, రబ్బర్ లపై కూడా జీఎస్టీ వేశారు. 14మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పుల కంటే మోదీ ఒక్కరే డబుల్ అప్పులు చేశారంటూ రేవంత్ విమర్శించారు.

Also Read : CM Jagan : వీళ్లా వారసులు? పులివెందుల సభలో షర్మిలకు సీఎం జగన్ కౌంటర్

పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు అన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశారని కేంద్ర ప్రభుత్వం తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వేసే ప్రతీఓటు రిజర్వేషన్లు తీసేయడానికి ఉపయోగపడుతుంది. కొందరు స్థానిక రాజకీయాల కోసం రిజర్వేషన్లు తీసేయడానికి సిద్ధమైన బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. రిజర్వేషన్లు కావాలా? వద్దా అనే దానికి ఈ ఎన్నికలు రెఫరెండం. రిజర్వేషన్లు ఉండాలి అనేవాళ్లు కాంగ్రెస్ పార్టీకి.. వద్దు అనేవాళ్లు బీజేపీకి ఓటేయండి అంటూ రేవంత్ రెడ్డి అన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు