Private Institutions : నవంబర్ 30 పోలింగ్ రోజు ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు ఇవ్వడం లేదని.. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు

స్థానిక అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సెలవు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.

private institutions

Private Educational Institutions : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నవంబర్ 30న అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే పలు ప్రైవేట్ విద్యాసంస్థలు రేపు (గురువారం) సెలవు ఇవ్వడం లేదని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. పలు ప్రైవేట్ సంస్థలు, కళాశాలల నుంచి వరుస ఫిర్యాదులు వస్తున్నాయి.

1950కు కంప్లైంట్స్ చేస్తున్నారు. స్థానిక అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సెలవు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆదేశాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.

High Security : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. లక్షమంది పోలీసు సిబ్బందితో భారీ భద్రత

బుధ, గురువారాల్లో పాఠశాలలకు సెలవులు 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధ, గురువారాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న పలువురు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో డీఈఓలు ఎస్ఎంఎస్ ల ద్వారా ఆదేశాలిచ్చారు.

హైదరాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు రెండురోజులు సెలవులు ప్రకటిస్తూ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులిచ్చారు. సూర్యపేట తదితర జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే సెలవులు ఇచ్చారు. నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Koushik Reddy : బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం సీరియస్‌

జీహెచ్ ఎంసీలో పలు ప్రైవేట్ స్కూల్స్ కు నవంబర్29న సెలవు

పోలింగ్ కేంద్రాలుగా లేని, వాటిల్లోని ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు లేకుంటే
అవి పని చేస్తాయని చెప్పారు. అలాంటివి కేవలం 5 శాతం ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉండొచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో ప్రైవేట్ స్కూల్స్ ను పోలింగ్ కేంద్రాలుగా వినియోగించుకోకున్నా వాటికి సంబంధించిన బస్సులను ఎన్నికల విధులకు వినియోగించుకుంటున్నారు.

దాంతో వాటికి కూడా బుధవారం సెలవు ఇవ్వాల్సి వస్తోందని జిల్లా అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలోని పలు ప్రైవేట్ స్కూల్స్ కూడా నవంబర్29న సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కూడా పోలింగ్ కేంద్రాలుగా ఉండటం, లెక్షరర్స్ ఎన్నికల విధుల్లో పాల్గొంటుండంతో బుధవారం కూడా సెలవులు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని లెక్షరర్స్ వర్గాలు చెబుతున్నాయి.

Telangana Elections 2023 : తెలంగాణలో కీలకం కానున్న మహిళా ఓటర్లు

ఎన్నికల విధుల్లోని సిబ్బందికి డిసెంబర్ 1న ప్రత్యేక సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పాఠశాల, ఇంటర్ విద్యాశాఖ, సాంకేతిక, ఉన్నత విద్యాశాఖ సిబ్బంది నవంబర్ 30నన అర్ధరాత్రి వరకు పని చేయాల్సివుటుంది కనుక వారికి డిసెంబర్ 1న ప్రత్యేక సెలవు ఇస్తూ పలు జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

ట్రెండింగ్ వార్తలు