Koushik Reddy : బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం సీరియస్‌

కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

Koushik Reddy : బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం సీరియస్‌

Election Commission (1)

Updated On : November 29, 2023 / 4:22 PM IST

Election Commission Serious on Koushik Reddy : హూజూరాబాద్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. తనను ఎన్నికల్లో గెలిపించకపోతే కుటుంబం సహా ఆత్మహత్య చేసుకుంటామని కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.  కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నిన్న ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ సారి తనను గెలిపిస్తే జైత్రయాత్ర ఒకవేళ ఓడిస్తే కనుక శవయాత్ర అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకరంగా చెప్పాలంటే ఆయన వ్యాఖ్యలు ఓటర్లను ఏమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఉన్నాయని ఈసీ పేర్కొంది. దీంతో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి వివాదాస్పద చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. స్థానిక రిటర్నింగ్ అధికారికి వివరణ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Huzurabad BRS MLA Candidate Padi Kaushik Reddy

గురువారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక 13 నియోజక వర్గాల్లో ఉదయం 7 నుంచి 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఓట్ల కౌంటింగ్ ఉంటుంది.

ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సైలెన్స్ పీరియడ్ లో సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. డబ్బు, మధ్యం పంపిణీపై ఎన్నికల సంఘం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎన్నికల ప్రక్రియను కంట్రోల్ రూం ద్వార పర్యవేక్షిస్తున్నారు. కాగా, పోల్ మేనేజ్ మెంట్ పై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి.

Also Read : నవంబర్ 30 పోలింగ్ రోజు ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు ఇవ్వడం లేదని.. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 2,290 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల బరిలో 221 మహిళా అభ్యర్ధులు ఉన్నారు. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 1,62,98,418 పురుషులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణలో 1,63,01,705 మహిళలు ఓటు వేయనున్నారు. తెలంగాణలో 9.9 లక్షల మంది మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే 27వేల వృధ్ద, దివ్యాంగ ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వార సుమారు 1.5 లక్షల మంది ఓటు వేశారు. ఈసీ మొత్తం 35,655 ఈవీఎలను ఏర్పాటు చేసింది.

Also Read : కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో 15 ఏళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహణ

12 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించారు. 1.4 లక్షల ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహణలో ఉన్నారు. పోలింగ్ భద్రత కోసం సుమారు లక్ష మంది భద్రతా సిబ్బందిని నియమించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం 2.5 లక్షల మంది విధుల్లో ఉన్నారు.