BRS : కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో 15 ఏళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహణ

నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివస్‌ స్ఫూర్తిగా పునరంకింతమవ్వాలని అన్నారు.

BRS : కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో 15 ఏళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహణ

BRS Deeksha Divas (1)

BRS Deeksha Divas : తెలంగాణ రాష్ట్రంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహించనుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన రోజు నవంబర్ 29న బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహించనుంది. తెలంగాణ స్వరాష్ట్ర కల సాకరానికి బీజం పడిన రోజు నవంబర్ 29. ‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’ అంటూ గులాబీ బాస్ కేసీఆర్ నినదించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29 రోజున ఆమరణ దీక్షకు దిగారు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకఘట్టంగా మారింది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన చారిత్రక దినం 2009 నవంబర్ 29. కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో 15 ఏళ్లు పూర్తైంది. రాష్ట్ర ఏర్పాటుపై కేసీఆర్ ఆమరణ దీక్ష కేంద్రాన్ని కదిలించింది. కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగా డిసెంబర్ 9న అప్పటి కేంద్రమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేశారు. ఆ తర్వాత స్వరాష్ట్ర కల సాకారం అయింది.

High Security : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. లక్షమంది పోలీసు సిబ్బందితో భారీ భద్రత

గత 14 ఏళ్లుగా తెలంగాణలో ప్రతి ఏటా నవంబర్ 29ని దీక్షా దివస్‌గా గులాబీ దళం జరుపుకుంటుంది. రాష్ట్ర గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివస్‌ కేటీఆర్. నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివస్‌ స్ఫూర్తిగా పునరంకింతమవ్వాలని అన్నారు.

నేడు (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా గులాబీ పార్టీ నేతల దీక్షా దివస్ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాలు చేయాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్తదాన శిబిరంకు కేటీఆర్ హాజరు కానున్నారు.