Panchayat Election: అయ్యో.. వేలంలో రూ.27లక్షలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్న వ్యక్తి.. తీరా అసలు విషయం తెలిసి..

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈనెల 15వ తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాలతో పార్టీల నేతలు క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నారు.

Gokulapadu village

Jogulamba Gadwal district: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈనెల 15వ తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాలతో పార్టీల నేతలు క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నారు. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తరువాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవికోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. భారీ మొత్తంలో వెచ్చించి ముందుగానే సర్పంచ్ పదవిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని గోకులపాడు గ్రామ సర్పంచ్ పదవికోసం గ్రామస్తులందరూ కలిసి ఆదివారం వేలంపాటు నిర్వహించారు.

Also Read: కేసీఆర్ లెక్కలు ఐ ఫోన్.. రేవంత్ లెక్కలు చైనా ఫోన్..! బీసీ రిజర్వేషన్లు, రైతు రుణమాఫీపై ఎమ్మెల్సీ కవిత కీలక కామెంట్స్

గోకులపాడు గ్రామంలో సుమారు ఏడు వందల మంది జనాభా ఉంది. అయితే, ఈ గ్రామంలో 450 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామస్తులంతా కలిసి సర్పంచ్ పదవికోసం వేలంపాట నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఆదివారం వేలంపాట నిర్వహించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. వేలం పాటకు సంబంధించి ఫొటోలు, వీడియోలుసైతం బయటకు రాలేదు. ఈ వేలంపాటలో గ్రామానికి చెందిన భీమరాజు, సిద్ధు, జయంతు, నరసింహులు పాల్గొని సర్పంచ్ పదవికోసం పోటీపడ్డారు. దీంతో భీమరాజు రూ.27.60లక్షలకు వేలంపాటలో సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడు. అయితే, ఈ వేలంపాటలో వచ్చిన డబ్బులను గ్రామంలోని శివాలయం గుడిని పూర్తి చేయడానికి ఉపయోగించాలని గ్రామస్తులు తీర్మానించారు.

Also Read: Rythu Bharosa: రైతులకు శుభవార్త.. వారందరికీ ఇవాళ ‘రైతు భరోసా’ నిధులు వచ్చేస్తున్నాయ్.. మీ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోండి..

గ్రామంలో సర్పంచ్ పదవికోసం ఎన్నికలకు వెళ్లి డబ్బును వృథా చేయడం కంటే.. ముందుగానే వేలంపాట ద్వారా ఏకగ్రీవంగా సర్పంచ్ ను ఎన్నుకొని.. వచ్చిన డబ్బును గ్రామం అభివృద్ధికోసం ఉపయోగిస్తే బాగుంటుందని ఈ ఆలోచన చేశామని గ్రామానికి చెందిన కొందరు పెద్దలు పేర్కొన్నారు. వేలంలో వచ్చిన డబ్బును గ్రామంలో శివాలయం గుడి నిర్మాణానికి వెచ్చించడం జరుగుతుందని తెలిపారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. వేలం పాటలో సర్పంచ్ పదవిని దక్కించుకున్న భీమరాజుకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. కానీ, స్థానిక సంస్థల రూల్స్ ప్రకారం ముగ్గురు పిల్లలు ఉన్నవారు సర్పంచ్, ఇతర లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. ఈ క్రమంలో గ్రామస్తులు నిర్వహించిన వేలం పాటలో సర్పంచ్ పదవిని దక్కించుకున్న భీమరాజుకు ఎన్నికల సంఘం షాకిస్తుందా.. అనే అనుమానాలను కొందరు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.