నయీం డబ్బులు, అస్తులు ఏమయ్యాయో విచారణ జరపాలి : వి.హనుమంతరావు

ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీచేసే విషయంపై వి.హన్మంతరావు మాట్లాడారు. ఖమ్మం టికెట్ నాకిస్తే భారీ మెజార్టీతో గెలుస్తానని అన్నారు.

V Hanumantha Rao

V Hanumantha Rao : నయీం అనే గ్యాంగ్ స్టర్ గతంలో కోట్ల రూపాయల భూములు కాజేశాడు. నయీం మరణం తరువాత అక్కడ దొరికిన డబ్బులు ఏమయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వి. హన్మంతరావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల భూములు నయీం లాక్కున్నారు. అవి ఏమయ్యాయో ప్రభుత్వం విచారణ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వీటిపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి, విచారణ జరిపితే ఆ భూములను పేదల ప్రజలకు ఇవ్వొచ్చు అని వి. హన్మంతరావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ను ప్రభుత్వం ఎలా సీరియస్ గా తీసుకుందో .. నయీం డబ్బులు, ఆస్తులు ఏమయ్యాయో కూడా తెలుసుకునేందుకు విచారణ జరిపించాలని వీహెచ్ కోరారు.

Also Read : ఆప్‌ అగ్రనాయకత్వమంతా తీహార్ జైలులోనే.. ఈ నలుగురు వెళ్లింది అవినీతి కేసుల్లోనే..

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరు ఉన్నారో తెలియజేయాలని వి.హన్మంతరావు ప్రభుత్వాన్ని కోరారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రికార్డు చేసిందని, అందులో ఇంకా చాలా అంశాలు బయటకు రావాలన్నారు. రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్ ల ఫోన్లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో అసలు సూత్రధారులు ఎవరు? ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్ అయ్యారు. వేగంగా విచారణ పూర్తి అసలు దోషులను బయటకు తేవాలని హన్మంతరావు ప్రభుత్వాన్ని కోరారు.

Also Read : జనసేనకు బిగ్‌షాక్‌.. ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాసు గుర్తు

ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీచేసే విషయంపై వి.హన్మంతరావు మాట్లాడారు. ఖమ్మం టికెట్ నాకిస్తే భారీ మెజార్టీతో గెలుస్తానని అన్నారు. ఖమ్మం లోక్ సభ సీటు నాకే ఇవ్వాలని ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు కోరాను. రాజీవ్ గాంధీతో కలిసి అక్కడే నేను తిరిగాను. అయితే, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని వి. హన్మంతరావు పేర్కొన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు