జనసేనకు బిగ్‌షాక్‌.. ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాసు గుర్తు

గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం..

జనసేనకు బిగ్‌షాక్‌.. ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాసు గుర్తు

Janasena party

Jana Sena Party : ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. పోలింగ్ తేదీకి గడువు దగ్గర పడుతుంది. టీడీపీ, జనసేన బీజేపీలు కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కూటమిలో భాగంగా జనసేన పార్టీకి దక్కిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలోనూ జోరు పెంచారు. గ్లాసు గుర్తుపై ఓటు వేసి కూటమి మద్దతుతో బరిలో నిలిచిన జనసేన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం తాజా ప్రకటనతో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది.

Also Read : Janasena : జనసేనకు షాక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి కీలక నేతలు

గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం.. ఏపీ సీఈవో గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేశారు. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో టీడీపీ, వైసీపీలు ఉన్నాయి. రిజిస్టర్ పార్టీల జాబితాలో జనసేన ఉంది. టీడీపీకి సైకిల్ గుర్తు, వైసీపీకి ఫ్యాన్ గుర్తును ఈసీ ప్రకటించింది. జనసేన గ్లాసు గుర్తు మాత్రం ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంది. గాజు గ్లాస్ అంటే జనసేన పార్టీ సింబల్ గా ప్రజల్లో గుర్తింపు వచ్చిన తరుణంలో ఈసీ తాజా ప్రకటనతో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది.

రాజకీయ పార్టీలు సాధించిన ఓటింగ్ శాతంనుబట్టి ఎన్నికల సంఘం పార్టీ గుర్తులను కేటాయిస్తుంది. ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఓటింగ్ శాతం సాధించలేని పార్టీలు రిజిస్టర్డ్ పార్టీలుగానే మిగిలిపోతాయి. గత ఎన్నికల్లో జనసేన పార్టీకి తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉండటంతో గ్లాసు గుర్తు కావాలని రిజిస్టర్డ్ పార్టీలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.