MSR Satyanaryana Rao : కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ కన్నుమూత

కరోనాతో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి (ఎమ్మెస్సార్) ఎం.సత్యనారాయణ రావు (87) కన్నుమూశారు. నిమ్స్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ ఎమ్మెస్సార్ మరణించారు. నిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

Msr Satyanaryana Rao

MSR Satyanaryana Rao : కరోనాతో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి (ఎమ్మెస్సార్) ఎం.సత్యనారాయణ రావు (87) కన్నుమూశారు. నిమ్స్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ ఎమ్మెస్సార్ మరణించారు. నిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ లో ఎమ్మెస్సార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఎమ్మెస్సార్ స్వస్థలం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామం. 1969 నుంచి 1971 వరకు తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెస్సార్ పాల్గొన్నారు. కరీంనగర్ నుంచి మూడు సార్లు ఎంపీగా పనిచేశారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. వైఎస్సార్ హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెస్సార్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా ఎమ్మెస్సార్ పనిచేశారు.